న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'హ్యపీ బర్త్ డే' అజింకా రహానె30

Happy Bday: Rahu is the best in Tests like Dravid, Rahane is called Team Indias Gandhi

హైదరాబాద్: టీమిండియా వైస్ కెప్టెన్ అజింకా రహానె నేటితో 30వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇతని బ్యాటింగ్ శైలిని బట్టి అతన్ని ఎక్కువగా రాహుల్ ద్రవిడ్‌తో పోలుస్తుంటారు. ఈ విషయంపై రహానె కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. రహానె కూడా ద్రవిడ్ లానే బ్యాటింగ్‌లో ఉన్నప్పుడు ఎటువంటి బంతినైనా ఎదుర్కోగలడు. అంతేకాదు ద్రవిడ్‌కు రహానే వీరాభిమాని కూడా.

అతని శైలినే అనుసరిస్తూ మైదానంలో ప్రశాంతంగా కనిపించే రహానె ఎటువంటి బంతికైనా తన బ్యాట్‌తో సమాధానం చెప్పగలడు. తొలినాళ్లలో క్రికెట్‌లో శిక్షణ పొందేందుకు నాలుగు కిలోమీటర్ల వరకూ ప్రయాణించాల్సి వచ్చేదట. అలా భుజంపై క్రికెట్ కిట్‌తో పయనించిన రహానె ఇప్పుడు టీమిండియాలో జట్టు సంపాదించుకుని స్టార్ క్రికెటర్‌గా మారాడు.

టీమిండియా ప్రస్తుత ఆటగాళ్లలో విదేశీ పిచ్ లపై రాణించగల సత్తా ఉన్న క్రికెటర్లలో రహానె ముఖ్యుడు. అతని శాంత వదనానికి, చక్కటి ప్రవర్తనకు నిదర్శనంగా జట్టులోని ఆటగాళ్లంతా అతణ్ని గాంధీ అని పిలుచుకుంటారు. చిన్నప్పటి నుంచి రహానె అమ్మతోనే చనువుగా ఉంటూ పెరిగాడు. ఇప్పటి వరకూ టెస్టులలో 44 మ్యాచ్‌లు ఆడి 2883 పరుగులను సాధించాడు. 90 వన్డేలలో 2962 పరుగులు పూర్తి చేశాడు.

ఈ నమ్మకంతోనే ఐపీఎల్ 2018 సీజన్‌లో అతనికి రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్సీ పదవిని కట్టబెట్టింది. ఈ ఐపీఎల్ మొత్తంలో 126 మ్యాచ్‌లు ఆడిన రహానె 3427 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, June 6, 2018, 16:27 [IST]
Other articles published on Jun 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X