న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Suryakumar Yadav Trolls: ఎందుకిలా ట్వీట్ చేశావ్.. నువ్వు మెచ్చుకుంటే పరాగ్ ఇంకా ఓవర్ చేస్తాడు..!

Netizens troll Suryakumar tweet About Riyan Parag showing amazing attitude in the field

ఫీల్డింగ్‌లో రియాన్ పరాగ్ వైఖరిపై సూర్యకుమార్ యాదవ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. ముంబై ఇండియన్స్ స్టార్ సూర్య సాధారణంగా ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ పట్ల నెటిజన్లు అసాధారణంగా రియాక్ట్ అవుతున్నారు. ట్విట్టర్‌లో ఓ వర్గం సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ రియాన్ పరాగ్ వైఖరిని మెచ్చుకోవడాన్ని మాత్రం పూర్తిగా తప్పుపట్టారు. ఇలాంటి ట్వీట్‌ను తొలగించాలని కూడా సూచించారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో రియాన్ పరాగ్ బౌండరీల వద్ద అద్భుతంగా ఫీల్డింగ్ చేసినప్పటికీ నోటి దురుసు మాత్రం తగ్గించుకోలేదు. అయితే రియాన్ పరాగ్ ఫీల్డింగ్ ఆటిట్యూడ్ పై సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ చేస్తూ.. ​​'అమేజింగ్ ఆటిట్యూడ్ ఆన్ ది ఫీల్డ్ #riyanparag #RRvGT" అని పేర్కొన్నాడు. సూర్య చేసిన ఈ ట్వీట్‌ను పలువురు స్వాగతించగా.. మరికొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే..?

గుజరాత్ ఛేజింగ్ చేస్తున్న టైంలో ట్రెంట్ బౌల్ట్ వేసిన 16వ ఓవర్‌లో గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ వైడ్ లాంగ్ ఆన్ వైపు ఓ షాట్ ఆడాడు. ఇక లాంగ్ ఆన్‌లో ఉన్న పరాగ్ అత్యంత వేగంగా పరిగెత్తి స్లిడ్ చేసి బంతిని బౌండరీకి ​​చేరకుండా ఆపాడు. ఇక ఆ బంతిని చేత్తో పట్టుకుంటే బౌండరీకి టచ్ అవుతానేమోనని వెంటనే బాల్ డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకొస్తున్న దేవదత్ పడిక్కల్ వైపు విసిరేశాడు. అతను విసిరేసిన టైంలో ఓ రకంగా ప్రవర్తించాడు. ఏంటలా పెళ్లికి వెళ్తున్నవాడిలా మెల్లగా వస్తావ్.. త్వరగా బాల్ అందుకుని త్రో వేయి అన్నట్లు కోపంగా ప్రవర్తించాడు. వెంటనే దేవదత్ బాల్ అందుకుని కీపర్ వైపు త్రో వేశాడు. ఫలితంగా రెండు రన్స్ సేవ్ అయ్యాయి. కానీ పరాగ్ మాత్రం తనకు కాస్త సీనియర్ అయిన తోటి సహచరుడి పట్ల అలా దురుసుగా ప్రవర్తించడం కాస్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక బ్యాటింగ్‌లోనూ అశ్విన్‌తో పెట్టుకున్నాడు

రియాన్ పరాగ్ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కేవలం ఫీల్డింగ్‌లోనే కాదు బ్యాటింగ్లోనూ ఆటిట్యూడ్ చూపించాడు. సీనియర్ ప్లేయర్ల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. ఇక రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో చివరి బంతికి అశ్విన్ క్రీజులో ఉన్నాడు. ఆ బంతిని యష్ దయాల్ వైడ్ వేశాడు. ఇక రియాన్ పరాగ్ మాత్రం బౌలింగ్ ఎండ్ నుంచి రన్ కోసం పరిగెత్తాడు. అసలు అశ్విన్ మాత్రం ఏం పట్టనట్లు అలాగే క్రీజులో ఉన్నాడు. ఆ బంతికి రన్ వచ్చే అవకాశం ఉన్నా.. అశ్విన్ సైతం హిట్టింగ్ చేయగలడు. అతన్నో బౌలర్‌లా భావించి పరుగు తీయడం, రనౌట్ అయ్యాక, ఏంటీ అశ్విన్ మరీ ఇంత నిర్లిప్తత ఏంటన్నట్లు ఏదో అని రియాన్ పరాగ్ పెవిలియన్ బాట పట్టడం కూడా కాస్త చర్చనీయాంశమైంది. ఈ ఘటనలే కాదు చాలా సందర్భాల్లో రియాన్ పరాగ్ తన ఆటిట్యూడ్ చూపించాడు.

సూర్యకుమార్ కాస్త ఆలోచించి ట్వీట్ చేయ్

రియాన్ పరాగ్ ఆటిట్యూడ్ ఫీల్డింగ్లో బాగుందంటూ సూర్యకుమార్ ట్వీట్ చేయడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఏంటీ సూర్య నువ్వు కూడా మద్దతిస్తావ్. సీనియర్ల మీదికి రెచ్చిపోయే ప్లేయర్ ను మెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ హితబోధ చేశాడు. ఇలా మెచ్చుకుంటూ పోతే పరాగ్ లాంటి ప్లేయర్లు మరింత ఓవర్ చేస్తారు అంటూ ఇన్నర్ మీనింగ్ తో ట్వీట్ చేశాడు. ఇంకొందరు ఇలాంటి ట్వీట్లు పెట్టకు సూర్య బ్రో.. డిలీట్ చేయ్. ఎందుకు అనవసరంగా ట్రోల్ కు గురవుతావ్ అంటూ సూచిస్తున్నారు. ఇక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్‌ను 7వికెట్ల తేడాతో ఓడించిన గుజరాత్ టైటాన్స్ సగర్వంగా ప్లేఆఫ్ చేరిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, May 25, 2022, 11:44 [IST]
Other articles published on May 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X