న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

GT vs CSK: చెన్నైసూపర్ కింగ్స్‌దే ఫస్ట్ బ్యాటింగ్.. మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం

GT vs CSK:Gujarat Titans won the toss and elected field first and Hardik pandya not playing this match

పుణే: చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ రషీద్ ఖాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రవీంద్ర జడేజా నేతృత్వంలోని చెన్నైసూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడడం లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా రషీద్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేసులో ఉండగా.. చెన్నైసూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో ఉంది.

టాస్ గెలిచిన అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ ''మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. హార్దిక్‌ పాండ్యాకు కాస్త గాయమైంది. కాబట్టి ఒక జట్టుగా మేము అవకాశం తీసుకోవాలనుకోలేదు. అందుకే అతను ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తదుపరి గేమ్‌కు తిరిగి వస్తాడు. ఈ మ్యాచ్‌కు కెప్టెన్సీ చేస్తున్న నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇది ఒక కల. కాబట్టి నేను చేయగలిగినంత నేర్చుకుని 100 శాతం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ స్థానంలో వ‌ృద్ధిమాన్ సాహా ఆడుతున్నాడు.'' అని చెప్పాడు.

GT vs CSK:Gujarat Titans won the toss and elected field first and Hardik pandya not playing this match

చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా మాట్లాడుతూ ''టాస్ గెలిస్తే మేం కూడా ముందుగా బౌలింగ్ చేసి ఉండేవాళ్లం. ఇప్పుడు మేము బోర్డుపై మంచి స్కోర్‌ను ఉంచి వారిపై ఒత్తిడి తెచ్చేలా చూస్తాము. చివరి గేమ్ తర్వాత మేము ఒక రోజు సెలవు తీసుకున్నాము. మంచి శిక్షణతో తిరిగి వచ్చాము. మా జట్టులో ఎలాంటి మార్పు లేదు. అని తెలిపాడు.

1
53638

తుది జ‌ట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా(కెప్టెన్), ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(కెప్టెన్), అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

Story first published: Sunday, April 17, 2022, 19:28 [IST]
Other articles published on Apr 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X