న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అయ్య బాబోయ్.. అసలు ధోనీ తెలియని వారు క్రికెట్‌ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?'

Graeme Smith lauds MS Dhoni: says he doubts there is anyone that didnt get on with MS

ఢిల్లీ: మాజీ కెప్టెన్‌ మిస్టర్‌ కూల్‌' ఎంఎస్ ధోనీ తెలియని వారు క్రికెట్‌ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనే సందేహం తాజాగా వ్యక్తం చేశాడు దక్షిణాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌. 2004లో భారత్‌-ఏ జట్టు తరఫున జింబాబ్వే పర్యటనకు వెళ్లిన జ్ఞాపకాలను మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ‌ గౌతమ్‌ గంభీర్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ పర్యటనలో తాను, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒకే గదిలో ఉన్నామని వెల్లడించాడు.

నెల రోజుల పాటు తామిద్దరం కలిసి ఒకే రూంలో ఉన్నామని, మాహీ చాలా మంచి వ్యక్తి అని గంభీర్‌ పేర్కొన్నాడు. అవి ఎంతో అద్భుతమైన జ్ఞాపకాలని, ఎప్పటికీ మర్చిపోలేనివని మాజీ ఓపెనర్ చెప్పాడు. గౌతీ భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

ఒకే రూంలో ఉన్నాం

ఒకే రూంలో ఉన్నాం

క్రికెట్‌ కనెక్ట్‌ పేరుతో నిర్వహిస్తున్న ఓ స్పోర్ట్స్‌ షోలో ఆదివారం గౌతమ్‌ గంభీర్‌ మాట్లాడుతూ... '2004లో భారత్‌-ఏ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్ళింది. అప్పుడు ధోనీ, నేను రూమ్‌ మేట్స్‌. నెల రోజులకు పైగా ఇద్దరం కలిసి ఒకే రూంలో ఉన్నాం. రూంలో ధోనీ, నేను ఎప్పుడు జుట్టు గురించే మాట్లాడుకేనేవాళ్లం. ఎందుకంటే.. అప్పట్లో మహీకి పొడుగాటి హెయిర్‌ స్టైల్‌ ఉండేది. అలా జుట్టును మెయిన్‌టైన్‌ చేయడం చాలా కష్టం. నువ్ ఏదైనా స్పెషల్‌గా వాడుతున్నావా? అని సరదాగా అడిగా' అని తెలిపాడు.

నేలపై పడుకున్నాం:

నేలపై పడుకున్నాం:

'జట్టు యాజమాన్యం మాకు (మహీ-గౌతీ) కేటాయించిన రూం చాలా చిన్నది. మొదటి వారం చాలా ఇబ్బందిగా అనిపించింది. మేమిద్దరం ఆ రూం పెద్దగా కనిపించడం ఎలా అని ఆలోచించాం. అప్పుడే మాకు ఓ ఆలోచన వచ్చింది. మంచాలు తీసేసి బెడ్స్‌ వేసుకొని నేలపై పడుకున్నాం. అదో గొప్ప మధురానుభూతి' అని గంభీర్‌ చెప్పాడు. ధోనితో కలిసి కెన్యా, జింబాంబ్వే, ఇండియా ఏ టూర్‌కు వెళ్లానని.. ఆ టూర్‌ బాగా ఎంజాయ్‌ చేశామని గంభీర్‌ పేర్కొన్నాడు. ధోనీ సారధ్యంలో భారత్‌ 2007 టీ20 ప్రపంచకప్‌, 2011లో ప్రపంచకప్ ‌గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ రెండు టోర్నీలలో మహీ సారథ్యంలో గౌతీ ఆడాడు.

 గంగూలీ వల్లే

గంగూలీ వల్లే

'ప్రతీ ఫార్మాట్‌లోనూ ఎంఎస్ ధోనీకి అద్భుతమైన జట్టు దొరకడం అదృష్టం. సచిన్ టెండూల్కర్‌, వీరేందర్ సెహ్వాగ్‌, యువరాజ్ సింగ్‌, విరాట్ కోహ్లీ‌తో పాటు నేను జట్టులో ఉండడం వల్ల 2011 వరల్డ్‌క్‌పలో ధోనీకి సారథ్యం ఎంతో సులువైంది. అయితే ఇలాంటి వారిని తయారు చేయడానికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంతో కష్టపడ్డాడు. అందుకే, గంగూలీ వల్లే ధోనీ ఎన్నో టైటిళ్లు సాధించాడు' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ధోనీ తెలియని వారు ఎవరైనా ఉన్నారా?

ధోనీ తెలియని వారు ఎవరైనా ఉన్నారా?

ఈ కార్యక్రమంలో గౌతమ్‌ గంభీర్‌తో పాటు దక్షిణాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్‌, మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్‌ మిస్టర్‌ కూల్‌ ఎంఎస్ ధోనీని‌ స్మిత్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. అయ్య బాబోయ్.. అసలు ధోనీ తెలియని వారు క్రికెట్‌ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనే సందేహం వ్యక్తం చేశాడు. మహీ అంటే తెలియని వారు ఎవరూ ఉండరంటూ స్మిత్‌ కొనియాడాడు. ఇంకా ధోనీ గురించి మాట్లాడుతూ... అతను చాలా సౌమ్యుడని, అందరితో కలుపుగోలుగా ఉంటారని ప్రశంసించారు. మహీ అంటే తనకి ఎంతో గౌరవం అని స్మిత్‌ పేర్కొన్నాడు.

ఆల్‌టైమ్ బెస్ట్ ఫీల్డర్ లిస్ట్: టాప్‌లో జడేజా.. చివరి స్థానంలో కోహ్లీ!!

Story first published: Monday, July 13, 2020, 14:43 [IST]
Other articles published on Jul 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X