న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌‌తో ఫైనల్: లార్డ్స్‌లో దేవుడు మనవైపే అంటోన్న రవిశాస్త్రి

 God will be in India dressing room if we play England in final, feels Ravi Shastri

హైదరాబాద్: ఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడితే దేవుడు మనవైపే ఉంటాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. 1983 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో రవిశాస్త్రి సభ్యుడైన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా లీగ్ దశలో ఎడ్జిబాస్టన్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 337 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో టీమిండియా 306 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఆ రోజు ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ వద్ద కూర్చున్న రవిశాస్త్రి ఈ ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు మరోసారి తలపడితే టీమిండియా గెలవాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపాడు.

రవిశాస్త్రి మాట్లాడుతూ

రవిశాస్త్రి మాట్లాడుతూ

రవిశాస్త్రి మాట్లాడుతూ "ఆరోజు దేవుడు ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో మళ్లీ ఇరు జట్లు తలపడితే దేవుడు మనవైపు ఉంటాడు. ఇప్పటివరకు ఎలా ఎవరూ చేయలేదు. " అని అన్నాడు. ఇక, ఈ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మపై రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.

టీమిండియా అగ్రస్థానంలో

టీమిండియా అగ్రస్థానంలో

"ఈ ప్రపంచకప్‌లో అతడు నిలకడగా ఆడబట్టే టీమిండియా అగ్రస్థానంలో ఉంది. అతడి ఫామ్ నన్ను ఆశ్చర్యానికి గురి చేయలేదు" అని రవిశాస్త్రి అన్నాడు. కాగా, సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సాధించిన సెంచరీ ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ సెంచరీ అంటూ కొనియాడాడు.

భారత్-కివీస్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి

భారత్-కివీస్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు గాను 211/5 స్థితిలో ఉన్న సమయంలో వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో అంఫైర్లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్టేడియం సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పారు. ఆ తర్వాత వర్షం ఎంతకీ తగ్గపోవడంతో మ్యాచ్‌ను బుధవారానికి మార్చారు. రిజర్వు డే అయిన బుధవారం తిరిగి మొదటి నుంచి ఆటను ప్రారంభించరు.

రిజర్వ్ డే రోజున కూడా వర్షం

ఎక్కడ నుంచి ఆగిందో అక్కడ నుంచే బుధవారం మ్యాచ్‌ని కొనసాగిస్తారు. రిజర్వే డే రోజున కూడా మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహించిన విజేతను నిర్ణయిస్తారు. లండన్ కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 10:30 గంట‌ల‌కు ఆరంభం అవుతుంది. బుధవారం కూడా మాంచెస్టర్‌లో వర్షం కురిసే అవకాశమున్నట్లు అక్కడి వాతావరణశాఖ తెలిపింది.

Story first published: Wednesday, July 10, 2019, 14:11 [IST]
Other articles published on Jul 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X