న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

GOAT debate: కోహ్లీ, సచిన్, ధోని ఎవరు గొప్ప? జయవర్దనే స్పందన ఇదీ!

Mahela Jayawardene Gives His Analysis On Kohli,Sachin And MS Dhoni!! | Oneindia Telugu
GOAT debate: Virat Kohli, Sachin Tendulkar or MS Dhoni? Mahela Jayawardene gives his analysis

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ... ఈ ముగ్గురిలో GOAT (ఆల్ టైం గ్రేట్ ప్లేయర్) ఎవరు? అన్న విషమయై సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అందరి కంటే గొప్పవాడని పాతతరం అభిమానులు కీర్తిస్తుండగా... వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్‌తోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌ ధోనీయే బెస్ట్ అని మరికొందరు ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మోడ్రన్ ఎరాలో రికార్డులు మీద రికార్డులు బద్దలు కొడుతున్న ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే గొప్ప అంటూ మరికొందరు అంటున్నారు.

<strong>Adorable Pic: రోహిత్ ఒడిలో సమైరా, అభిమానులు పుల్ హ్యాపీ</strong>Adorable Pic: రోహిత్ ఒడిలో సమైరా, అభిమానులు పుల్ హ్యాపీ

GOAT డిబేట్ విషయంలో

GOAT డిబేట్ విషయంలో

ఈ GOAT డిబేట్ విషయంలో అభిమానులు సైతం చీలిపోయారు. అసలు క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌తో వీరిద్దరికి పోలికేంటని ఇంకొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్? అని జరుగుతున్న చర్చ విషయమై శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే స్పందించాడు.

జయవర్దనే మాట్లాడుతూ

జయవర్దనే మాట్లాడుతూ

జయవర్దనే మాట్లాడుతూ "సచిన్ ఆటను చూస్తూం పెరిగాం. గతంలో సచిన్ కూడా ఇలాగే ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. కొంత కాలం ధోనీ ఈ భారాన్ని మోశాడు. తర్వాతి తరానికి ఈ బాధ్యత కోహ్లీ భుజస్కంధాలపై ఉంది" అని అన్నాడు.

ఒత్తిడిని తట్టుకునే విరాట్ కోహ్లీ

ఒత్తిడిని తట్టుకునే విరాట్ కోహ్లీ

"ఒత్తిడిని తట్టుకునే విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలవాలని భారత అభిమానులను కోరుకుంటారు. కెప్టెన్‌గా ఉండటం అంత తేలికేం కాదు. మైదానంలో కెప్టెన్ బాధ్యతగా ఎలా ఉండాలో కోహ్లీ అర్థం చేసుకున్నాడు" అని జయవర్దనే తెలిపాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై జయవర్దనే ప్రశంసల వర్షం కురిపించాడు.

కోహ్లీతో ప్రస్తుత తరంలోని ఆటగాళ్లనెవర్నీ పోల్చలేం

కోహ్లీతో ప్రస్తుత తరంలోని ఆటగాళ్లనెవర్నీ పోల్చలేం

అటు కెప్టెన్సీలో, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్న అతడితో ప్రస్తుత తరంలోని ఆటగాళ్లనెవర్నీ పోల్చలేమని జయవర్దనే స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ ఏకైక అత్యుత్తమ క్రికెటర్‌గా కాకున్నా.. అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా కోహ్లీ నిలుస్తాడని జయవర్దనే చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, February 14, 2019, 13:45 [IST]
Other articles published on Feb 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X