న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌లో అజహరుద్దీన్‌కి గౌరవం: గంభీర్ ట్వీట్, ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

Gautam Gambhir Trolled On Twitter For Criticising Mohammad Azharuddins Eden Gardens Honour

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ గత ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో తొలి టీ20కి ముందు గంట మోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంభీర్‌ తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

<strong>'బీసీసీఐలో అవినీతిని అడ్డుకోవడానికి ఆదివారం సెలవేమో?'</strong>'బీసీసీఐలో అవినీతిని అడ్డుకోవడానికి ఆదివారం సెలవేమో?'

''ఈడెన్‌ గార్డెన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ గెలిచి ఉండొచ్చు. కానీ బీసీసీఐ, సీవోఏ, క్యాబ్‌ ఓడిపోయాయి. ఆదివారం ఏమైనా అవినీతిపరులకు మినహాయింపు ఇచ్చారా? హెచ్‌సీఏ ఎన్నికల్లో అజహర్‌ను పోటీ చేసే అవకాశం ఇచ్చారని విన్నా.. కానీ అతను బెల్‌కొట్టడమే నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది'' అని గంభీర్ ట్వీట్ చేశాడు.

నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాం

అయితే ఈ ట్వీట్‌ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన పలువురు క్రికెట్ అభిమానులు ఈ ట్వీట్‌పై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. "గంభీర్‌ అసలు ఏమైంది నీకు.. మీరంటే ఎంతో గౌరవం కానీ మీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయనుకోలేదు" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

నిషేధంపై క్లీన్‌చీట్‌ ఇచ్చిన విషయం తెలియదా?

మరొక నెటిజన్ హైకోర్టు అజహరుద్దీన్‌పై విధించిన నిషేధంపై క్లీన్‌చీట్‌ ఇచ్చిన విషయం తెలియదా? ప్రశ్నించాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో పాలుపంచుకున్నందుకు అజహర్‌కు బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఇంకొక నెటిజన అయితే అజహరుద్దీన్ ఎంపీ కూడా అయ్యారని ట్వీట్ పెట్టాడు.

 2000లో మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో నిషేధం

2000లో మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో నిషేధం

భారత్‌ తరపున 99 టెస్టులు, 334 వన్డేలాడిన అజహరుద్దీన్‌పై 2000లో మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో బీసీసీఐ జీవితకాల నిషేదం విధించింది. అయితే, బీసీసీఐ విధించిన నిషేధంపై అజహరుద్దీన్ హైకోర్టుని ఆశ్రయించడంతో 2012లో హైకోర్టు అతడిపై నిషేధం ఎత్తివేసింది. అప్పటి నుంచి అజహరుద్దీన్ క్రికెట్‌ తరహా అధికారిక కార్యకలపాల్లో పాలుపంచుకుంటున్నాడు.

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సైతం

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సైతం

గతేడాది హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సైతం పోటీ చేసాడు. నిషేదం ఎత్తివేతపై స్పష్టత లేదని తొలుత నిరాకరించిన బీసీసీఐ ఆ తర్వాత అజహరుద్దీన్‌ను అన్ని క్రికెట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనుమతినించింది. అలాగే బీసీసీఐ, ఐసీసీల్లో ఎలాంటి బాధ్యతలు చేపట్టకుండా అతనిపై నిషేధం విధించలేమని కూడా స్పష్టం చేసింది.

ఈడెన్‌లో తొలి సెంచరీని సాధించిన అజహరుద్దీన్

ఈడెన్‌లో తొలి సెంచరీని సాధించిన అజహరుద్దీన్

దీంతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20కు ముందు గంట మోగించాడు. తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఇదే స్టేడియంలో ఆడి సెంచరీ చేసిన అజహరుద్దీన్ ఆ తర్వాత ఆడిన మరో 6 టెస్టుల్లో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యంత వేగంగా సెంచరీని (74 బంతుల్లో) అజహర్‌ 1996లో దక్షిణాఫ్రికాపై ఈడెన్‌లోనే సాధించాడు.

Story first published: Tuesday, November 6, 2018, 16:30 [IST]
Other articles published on Nov 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X