న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : కోహ్లీనే కాదు.. వాళ్లు కూడా రంజీలు ఆడితేనే బెటర్.. మాజీ లెజెండ్ సలహా!

Former legend wants Team India players to play Ranji Trophy

న్యూజిల్యాండ్‌పై వరుసగా రెండు వన్డేలు గెలిచిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ సిరీస్‌లో జరిగే మూడో వన్డేకు ప్రాధాన్యం లేకుండా పోయింది. కాబట్టి ఈ మ్యాచ్‌ నుంచి టీమిండియా కీలక ఆటగాళ్లు తప్పుకోవాలని మాజీలు సలహా ఇస్తున్నారు. ఇంతకుముందు నుంచే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ వన్డే నుంచి తప్పుకొని రంజీ ట్రోఫీ ఆడాలని రవిశాస్త్రి సహా పలువురు మాజీలు సూచించిన సంగతి తెలిసిందే.

 కోహ్లీ ఒక్కడే కాదు..

కోహ్లీ ఒక్కడే కాదు..

ఇప్పుడు కేవలం కోహ్లీనే కాదు.. రోహిత్ శర్మ, మహమ్మద్ సిరాజ్, షమీ తదితరులు కూడా ఇదే పని చేయాలని మాజీ లెజెండ్ వసీం జాఫర్ అంటున్నాడు. ఎటూ కివీస్ సిరీస్ మన ఖాతాలో పడింది కాబట్టి, వీళ్లంతా రాబోయే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కోసం సన్నాహకాలు మొదలు పెట్టాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు. రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ మంగళవారం మొదలవుతుంది. భారత జట్టు కివీస్‌తో మూడో వన్డే కూడా అదే రోజు ఆడాల్సి ఉంది. ఇదే విషయం చెప్పిన జాఫర్.. టీమిండియా కీలక ఆటగాళ్లు ఈ వన్డే నుంచి తప్పుకొని రంజీ ట్రోఫీ ఆడాలని చెప్పాడు.

 అందరూ రంజీలు ఆడాలి..

అందరూ రంజీలు ఆడాలి..

టీమిండియా కీలక ఆటగాళ్లు టెస్టు మ్యాచులు ఆడి చాలా కాలమైంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడారు. కానీ ఇద్దరూ ఆ సిరీస్‌లో పెద్దగా రాణించలేదు. ఇక రోహిత్ శర్మ అయితే గతేడాది మార్చిలో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ అతను టెస్టులు ఆడలేదు. ఇలాంటి సమయంలో టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టుకు సిద్ధంగా ఉండటం జరగదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. వీళ్లంతా తొలి టెస్టుకు సన్నద్ధంగా ఉండాలంటే రంజీలు ఆడాల్సిందేనని సూచించాడు.

 ఆసీస్ సిరీస్ కీలకం..

ఆసీస్ సిరీస్ కీలకం..

ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ భారత్‌కు చాలా కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్ ఈ సిరీస్ గెలిచి తీరాలి. అంతేకాదు, టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా నిలవాలన్నా కూడా ఈ సిరీస్ కీలకమే. అందుకే భారత ఆటగాళ్లు ఈ సిరీస్‌పై ఫోకస్ పెట్టాలని వసీం జాఫర్ గట్టిగా చెప్పాడు. అలాగే ప్రస్తుతం వన్డే జట్టుతో ఉన్న కేఎస్ భరత్‌ను కూడా రంజీలకు పంపాలని చెప్పాడు. అతను ఎలాగూ మూడో వన్డే కూడా ఆడటం జరగదని, కాబట్టి అతన్ని టెస్టు సిరీస్‌కు సన్నద్ధం చేయాలని చెప్పాడు. పంత్ గైర్హాజరీలో భరత్ చాలా కీలకమైన ఆటగాడిగా మారతాడని అభిప్రాయపడ్డాడు.

Story first published: Sunday, January 22, 2023, 11:44 [IST]
Other articles published on Jan 22, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X