న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : మూడో టీ20కి మంచి పిచ్ కావాలి.. టాపార్డర్‌కు అదొక్కటే దారి!

Former legend wants better pitch for third INDvsNZ T20I

భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన తొలి రెండు టీ20ల్లో స్పిన్నర్లు రాజ్యమేలారు. ఈ రెండు మ్యాచులకు తయారు చేసిన పిచ్‌లు రెండూ కూడా పూర్తిగా పూర్తిగా స్పిన్నర్లకు సహకారం అందించాయి. దీంతో భారీ స్కోర్లు నమోదవలేదు. తొలి టీ20లో అయితే ఓమోస్తరు స్కోర్లయినా నమోదయ్యాయి. కానీ రెండో టీ20లో కివీస్ కేవలం 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ ఈ లక్ష్యాన్ని కూడా ఛేదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

 మూడో టీ20లో పరుగుల విందు!

మూడో టీ20లో పరుగుల విందు!

చివరకు నాలుగు వికెట్లు కోల్పోయి, ఒక్క బంతి మిగిలుండగా విజయం సాధించింది. అయితే మూడో టీ20లో ఈ పరిస్థితి మారుతుందని మాజీ లెజెండ్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే మూడో మ్యాచ్ జరిగేది అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో. ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదవడం పరిపాటిగా వస్తోంది.

ఇక్కడి పిచ్ బ్యాటర్లకు సహకారం అందిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ప్రేక్షకులకు పరుగుల విందు ఉంటుందని జాఫర్ అభిప్రాయపడ్డాడు. తొలి మ్యాచ్ జరిగిన రాంచీలో పిచ్ స్పిన్నర్లకు సహకరించడంతో భారత బ్యాటర్లకే నష్టం జరిగింది. వాళ్లు ఛేజింగ్‌లో ఫెయిలయ్యారు. రెండో టీ20లో లక్ష్యాన్ని ఛేదించినా కూడా లక్నో పిచ్‌పై ఆడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

మంచి స్కోర్లు నమోదవుతాయి..

మంచి స్కోర్లు నమోదవుతాయి..

'అహ్మదాబాద్‌లో దీని కన్నా మెరుగైన పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నా. మంచి మ్యాచ్ ఉంటుందని ఆశిస్తున్నా. అక్కడ కూడా స్పిన్నర్లకు సహకారం అందితే ఆశ్చర్యపోవడం తప్ప ఏం చేయలేను. ఎందుకంటే అహ్మదాబాద్‌లో సాధారణంగా మంచి మ్యాచులే కనిపిస్తాయి.

160-170 పరుగుల స్కోర్లు నమోదవ్వొచ్చు. చివరి రెండు మ్యాచులతో పోలిస్తే ఇక్కడి పిచ్ కూడా బాగుటుందని అనుకుంటున్నా. అహ్మదాబాద్‌లో భారీగా ప్రేక్షకులు వస్తారు. వాళ్లందరికీ మంచి మ్యాచ్ చూసే అవకాశం ఉంది. అక్కడ భారత్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నా' అని జాఫర్ చెప్పాడు.

టాపార్డర్‌కు ఇదే సలహా

టాపార్డర్‌కు ఇదే సలహా

తొలి రెండు మ్యాచుల్లో బౌలర్లు రాణించినా.. టీమిండియా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. దీన్ని కూడా జాఫర్ ఎత్తిచూపాడు. అంతేకాదు, మూడో టీ20 ముందు వాళ్లకు మంచి సలహా కూడా ఇచ్చాడు. 'తొలి రెండు మ్యాచుల్లో జరిగింది టాపార్డర్ బ్యాటర్లు మర్చిపోవాలి. వరుసగా అలాంటి పిచ్‌లపై ఆడాల్సి రావడం చాలా అరుదు.

ఆ ఆలోచనను బుర్రలో నుంచి తీసేయాలి. మూడో మ్యాచ్‌లో ఫ్రెష్ మైండ్‌సెట్‌తో బరిలో దిగాలి. ఎప్పట్లాగే ఎగ్రెసివ్ ఆటతో మూడో టీ20లో అడుగు పెట్టాలి' అని సూచించాడు. తొలి రెండు మ్యాచుల్లో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠీ ముగ్గురూ పెద్దగా రాణించలేదు. చాలా దారుణంగా ఫెయిలయ్యారు.

Story first published: Monday, January 30, 2023, 16:17 [IST]
Other articles published on Jan 30, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X