న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : ఐపీఎల్‌లో కూడా ఓపెనింగ్ చెయ్యడు కదా.. మరి ఓపెనర్‌గా పంత్ ఎందుకు?.. మాజీ క్రికెటర్ అనుమానం

 Former Cricketer ask why Rishabh Pant should be considered as opener

టీ20ల్లో వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయిన వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపాలని పలువురు మాజీలు సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అసలు పంత్‌ను ఎందుకు ఓపెనర్‌గా పంపాలని ప్రశ్నిస్తున్నాడు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా. కనీసం ఐపీఎల్‌లో అయినా ఓపెనింగ్ చేసే వాళ్లను తీసుకోవచ్చు కదా అని అడిగాడు.

పంత్ ఎందుకు?

పంత్ ఎందుకు?

'ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా పంత్ మహా అయితే మూడో స్థానంలో వచ్చాడు. అంతేకానీ ఓపెనింగ్ చెయ్యలేదు. అలాంటప్పుడు టీమిండియాకు ఓపెనర్‌గా ఎలా పంపుతాం? కనీసం ఐపీఎల్‌లో ఓపెనర్‌గా రాణించిన వారికి అవకాశం ఇవ్వాలి. ఓపెనర్‌గా వచ్చే వాళ్లు అగ్రెసివ్‌గా ఆడాలి. సపోర్ట్‌గా ఉండటం కాదు. పంత్ అగ్రెసివ్ ప్లేయర్ అని నేను కూడా ఒప్పుకుంటాను. ఓపెనర్‌గా వచ్చినప్పుడే అతను టీ20ల్లో సెంచరీ కూడా చేశాడు. కానీ ప్రస్తుతానికైతే కనీసం ఐపీఎల్‌లో అయినా ఓపెనింగ్ చేసే వాళ్లను భారత ఓపెనర్‌గా తీసుకోవాలి' అని చోప్రా అన్నాడు.

పృథ్వీ షా, సంజూ శాంసన్ ఉన్నారుగా..

పృథ్వీ షా, సంజూ శాంసన్ ఉన్నారుగా..

టీ20 ఫార్మాట్‌లో భారత ఓపెనర్‌ రేసులో పృథ్వీ షా ముందు వరుసలో ఉన్నాడు. షా అయితే సహజంగానే డిస్ట్రక్టివ్ ఆటగాడని, అలాంటి వాడు పవర్‌ప్లేలో అదరగొడతాడని ఆకాష్ చోప్రా అన్నాడు. 'అలాగే ఓపెనర్‌గా నా మరో చాయిస్ సంజూ శాంసన్. తను ఫాస్ట్ బౌలింగ్‌ను అద్భుతంగా ఆడతాడు. స్పిన్నర్లను కూడా దంచి కొడతాడు. కేవలం లెగ్‌స్పిన్ విషయంలో అదీ బౌలర్ పేరు వానిందు హసరంగ అయినప్పుడు మాత్రమే ఇబ్బంది పడతాడు. కాబట్టి అతన్ని కూడా ఓపెనర్‌గా పంపవచ్చు. సంజూ కూడా భారీ షాట్లతో విధ్వంసకర ఓపెనింగ్‌లు అందించగలడు' అని వివరించాడు.

టాపార్డర్‌లోనే కరెక్ట్..

టాపార్డర్‌లోనే కరెక్ట్..

సంజూకు ఇస్తే టాప్-3లోనే అవకాశం ఇవ్వాలని చోప్రా అన్నాడు. 'సంజూ శాంసన్ ఆటతీరే ఎటాకింగ్‌గా ఉంటుంది. అతను కూడా తొలి బంతి నుంచి భారీ షాట్లు ఆడగలడు. ఇప్పుడు అతన్ని జట్టులో సెలెక్ట్ చేశారు కాబట్టి.. ఓపెనర్ లేదా వన్‌డౌన్‌లో పంపించాలి. అంతేకానీ ఆరో స్థానంలో పంపించి, అక్కడ పరుగులు చేయకపోతే ఫెయిలయ్యాడని అనడం కరెక్ట్ కాదు' అని సంజూకు మద్దతు తెలిపాడు. ఐపీఎల్‌లో కూడా తొలి మూడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాడు. ధనాధన్ ఆటతీరుతో 160 పైగా స్ట్రైక్ రేటుతో 138 పరుగులు చేశాడు. ఇదే విషయాన్ని చోప్రా కూడా బలంగా చెప్పాడు. సంజూనే టాపార్డర్‌లో ఆడించాలని, అంతేకానీ ఫినిషర్‌గా కొత్త రోల్‌లో దింపడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. మరి టీమిండియా మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో చూడాలి.

Story first published: Saturday, November 19, 2022, 16:57 [IST]
Other articles published on Nov 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X