న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ వాట్సన్ మృతి!!

Former Australian All-Rounder Graeme Watson Dies Aged 75

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ గ్రేమ్ వాట్సన్ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వాట్సన్ మృతిపై ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)తో పాటు పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సంతాపం తెలియజేశారు. 1967 నుంచి 1972 మధ్యలో వాట్సన్ ఐదు టెస్టులు, 1972 రెండు వన్డేలు ఆడారు. 1972లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఆయన ప్రకటించారు.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. మధ్యలో నా భార్య గుర్తొచ్చింది: స్టార్ క్రికెటర్ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. మధ్యలో నా భార్య గుర్తొచ్చింది: స్టార్ క్రికెటర్

దక్షిణాఫ్రికాపై ఆరంగేట్రం:

దక్షిణాఫ్రికాపై ఆరంగేట్రం:

విక్టోరియా జట్టు తరఫున గ్రేమ్ వాట్సన్ తన కెరీర్‌ని ఆరంభించారు. అద్భుతంగా ఆడుతూ 1966-67 దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్నారు. కేస్‌టౌన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో వాట్సన్ ఆరంగేట్రం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసిన వాట్సన్.. చీలమండ గాయం కారణంగా ఆ తర్వాతి టెస్ట్‌కి దూరమయ్యారు. ఇక నాలుగో టెస్టులో వాట్సన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశారు. 67 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయారు. అయితే ఆస్ట్రేలియా ఆ సిరీస్‌ ఓడింది.

డాక్టర్ల సూచనతో క్రికెట్‌కు గుడ్ బై:

డాక్టర్ల సూచనతో క్రికెట్‌కు గుడ్ బై:

గ్రేమ్ వాట్సన్ కెరీర్ మొత్తం గాయాలతోనే సరిపోయింది. మెల్‌బోర్న్ వేదికగా 1971-72 మధ్యలో జరిగిన ఓ మ్యాచ్‌లో బౌలర్ టోనీ గ్రేగ్ వేసిన బంతి వాట్సన్ ముక్కుకు బలంగా తగిలింది. దీంతో డాక్టర్లు ఆయనను ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత కోలుకున్న వాట్సన్.. తన కెరీర్‌లో చివరి రెండు టెస్టులు, మరో రెండు వన్డేలు ఆడారు. వాట్సన్ మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌, మీడియం పేస్ బౌలర్. తరుచూ గాయాలపాలవ్వడంతో డాక్టర్ల సూచనతో క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మెరిసిన వాట్సన్:

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మెరిసిన వాట్సన్:

గ్రేమ్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించకున్నా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం మెరిశారు. 1971-72లో అతను వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ఆడారు. 1971-72, 1972-73,1974-75 సీజన్లలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ గెలవడంతో వాట్సన్ కీలక పాత్ర పోషించారు. 107 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 4674 పరుగులు, 186 వికెట్లు తీశారు. న్యూసౌత్ వేల్స్‌లో జరిగిన మ్యాచ్‌ అనంతరం రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. వాట్సన్ మెల్బోర్న్ కోసం ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్‌ కూడా ఆడారట. ఆ తరువాత విజయవంతమైన వాస్తుశిల్పిగా మారారని క్రికెట్.కామ్‌లోని ఒక నివేదిక పేర్కొంది.

Story first published: Saturday, April 25, 2020, 15:38 [IST]
Other articles published on Apr 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X