న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2018: ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకూ విదేశీ పర్యటనలో కోహ్లీ సేన విఫలమైందిలా..

Flashback 2018: Cape Town to Perth, a tale of lost opportunities for Virat Kohli and band

బెంగళూరు: కేప్ టౌన్, బర్మింగ్‌హామ్, సౌతాంప్టన్, లండన్, పెర్త్ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోన్న ప్రధాన నగరాలు. కానీ, ఇవన్నీ భారత్ విదేశీ పర్యటన చేసి ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికలు. ప్రతి మైదానంలోనూ కోహ్లీసేన అతి చిన్న కారణాలతో ఘోరంగా విఫలమైంది. వాటన్నటికీ కారణం మైదానానికి తగ్గట్లుగా జట్టును ఎంచుకోకపోవడమే. టీమ్ మేనేజ్‌మెంట్‌లో భాగమైన విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రిలు మైదానం వాటి పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో జట్టు కూర్పులో తడబాటే కాకుండా.. పిచ్ పరిస్థితులకు విభిన్నంగా తయారైంది.

కేప్ టౌన్:

కేప్ టౌన్:

సొంతగడ్డపైనా విదేశాల్లోనూ టెస్టు ఫార్మాట్లో కనిపిస్తోన్న ఆటగాడు అజింకా రహానె. కానీ, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరగిన తొలి టెస్టుకు భారత పిచ్‌లకు మాదిరి అవి స్లో పిచ్‌లు కాకపోవడంతో రహానెను బెంచ్‌కు పరిమితం చేసి రోహిత్‌ను ఆడించింది. దానికి కారణం రోహిత్ అంతకుముందే లంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసుకోవడం, కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో రెండు హాఫ్ సెంచరీలు దక్కించుకోవడమే. డేల్ స్టైన్ రెచ్చిపోయి ఆడిన ఇన్నింగ్స్ 208ని భారత్ చేధించలేకపోయింది. రహానె గైర్హాజరీలో రోహిత్ 10, 11పరుగులతోనే సరిపెట్టుకుని విఫలమైయ్యాడు. దీంతో భారత్ 72పరుగుల తేడాతో ఓడిపోయింది.

 బర్మింగ్‌హామ్:

బర్మింగ్‌హామ్:

కేప్ టౌన్ టెస్టుకు ఎంపిక కాని ధావన్ బర్మింగ్‌హామ్‌లో జరిగిన టెస్టుకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా బరిలోకి దిగిన భారత్‌లో భాగమవడానికి కారణం.. బెంగళూరు వేదికగా అఫ్ఘనిస్తాన్‌పై రెచ్చిపోయి ఆడడం కారణం కావొచ్చు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ ఒక స్పిన్నర్ కావాలని రవిచంద్రన్ అశ్విన్‌ను, ఆల్ రౌండర్‌గా హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుంది. పది ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన పాండ్యా 46 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయకుండా రెండో ఇన్నింగ్స్‌ను ముగించాడు. అతనికంటే రవీంద్ర జడేజాను తీసుకుంటే బాగుండేది.

 లార్డ్స్:

లార్డ్స్:

తేమతో కూడిన వాతావరణంలో పచ్చిక మైదానంలో ఫీల్డింగ్‌నే ఎంచుకుంది భారత్? అశ్విన్‌తో పాటుగా కుల్దీప్ యాదవ్ అరంగ్రేటం జరిగింది. అశ్విన్ 17వికెట్లు తీసి 68పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ తొమ్మిది ఓవర్లపాటు బౌలింగ్ చేసి 44పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయినప్పటికీ భారత్ 159 పరుగుల తేడాతో ఇన్నింగ్స్‌లో పరాజయాన్ని చవిచూసింది. దీనికి కూడా పిచ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా బరిలోకి దిగడమేనని చెప్పాలి.

సౌథాంప్టన్:

సౌథాంప్టన్:

టార్గెట్ 245 పరుగులు కానీ భారత్‌ను ఎదుర్కొంటూ మొయిన్ అలీ బాదడంతో 184పరుగులు చేసి సరిపెట్టుకుంది ఇంగ్లాండ్. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వంద శాతం కష్టపడింది రవిచంద్రన్ అశ్విన్‌యేనని చెప్పాలి. ఈ పిచ్‌పై ఇద్దరు స్పిన్నర్లు అవసరమవడంతో మరోసారి జడేజాకు అవకాశం కల్పించారు.

పెర్త్:

పెర్త్:

ఆస్ట్రేలియాతో ఆడిన రెండో టెస్టులో అశ్విన్ గాయం కారణంగా దూరమైయ్యాడు. పాండ్యా ఇంకా కోలుకోని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జట్టు మేనేజ్‌మెంట్‍‌కు కనిపించిన ఆశాకిరణం రవీంద్ర జడేజా. కానీ, భారత్ ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్ కావాలని తలచి హనుమవిహారీని జట్టులోకి తీసుకుని అతనిలోని ఆఫ్ స్పిన్‌ కూడా జట్టుకు బలం చేకూరుస్తుందని భావించింది. పెర్త్‌లో ముగ్గురు ఫేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగిన ఆసీస్ ఇరగదీసింది. 146పరుగుల తేడాతో విజయం సాధించింది. నలుగురు ఫేసర్లతో ఆడిన కోహ్లీ మరోసారి బురిడీ కొట్టాడు.

Story first published: Tuesday, December 25, 2018, 15:14 [IST]
Other articles published on Dec 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X