న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హ్యాపీ బ‌ర్త్ డే రాహుల్ ద్రావిడ్‌.. నిల‌క‌డ‌కు మారు పేరు.. రికార్డుల‌కు రారాజు

Fans wishing Rahul Dravid a happy birthday

నేడు ది వాల్‌గా పిల‌వ‌బ‌డే భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు రాహుల్ ద్రావిడ్ పుట్టిన రోజు. నేడు 49వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్న ఈ దిగ్గ‌జ బ్యాట‌ర్ గురించి ఎంత చెప్పుకున్న త‌క్కువే. క్రికెట్‌లో ఎన్నో రికార్డుల‌ను త‌న పేరు మీద లిఖించుకున్నాడు. ఎన్నోసార్లు వికెట్ల‌కు అడ్డుగోడ‌లా నిల‌బ‌డి భార‌త్‌ను గెలిపించాడు. నిల‌క‌డ‌కు మారు పేరుగా నిలిచి రికార్డుల రారాజు అనిపించుకున్నాడు. కెప్టెన్‌గానూ, వికెట్ కీప‌ర్‌గా టీమిండియాకు త‌న సేవ‌లు అందించాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక భార‌త జ‌ట్టుకు మెరికల్లాంటి ఆట‌గాళ్ల‌ను త‌యారు చేసే ప‌నిని త‌న భుజాన వేసుకోని విజ‌యంతంగా నిర్వ‌ర్తించాడు.

ఈ క్ర‌మంలో భారత అండ‌ర్ 19 జ‌ట్టును త‌న‌దైన రీతిలో తీర్చిదిద్దాడు. ప్ర‌స్తుతం టీమిండియా సీనియ‌ర్ టీంకు రాహుల్ ద్రావిడ్ హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ద్రావిడ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అభిమానుల‌తోపాటు క్రికెట‌ర్లు కూడా ద్రావిడ్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

ద్రావిడ్ క్రికెట్ అరంగేట్రం

1973 జనవరి 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గ‌ల‌ మరాఠీ మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో రాహుల్ ద్రావిడ్ జన్మించాడు. 1996 నుంచి 2012 మ‌ధ్య అంటే 17 ఏళ్ల‌పాటు భారత క్రికెట్ జట్టుకు ఆట‌గాడిగా ప్రాతినిధ్యం వహించాడు. 1996 ఏప్రిల్ 3న శ్రీ‌లంక‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ ద్వారా ద్రావిడ్‌ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది జూన్ 20న లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

క్రికెట్‌లో అలా మొద‌లైన ద్రావిడ్ ప్ర‌యాణం 17 ఏళ్ల పాటు నిర్విరామంగా కొన‌సాగింది. కెరీర్‌లో త‌న చివ‌రి వ‌న్డే మ్యాచ్‌ను 2011 సెప్టెంబ‌ర్ 16న ఇంగ్లండ్‌తో ఆడాడు. ఇక చివ‌రి టెస్టును 2012 జ‌న‌వ‌రి 24న ఆస్ట్రేలియాతో ఆడాడు. అనేక మ్యాచ్‌ల‌కు ద్రావిడ్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.

ద్రావిడ్ కెరీర్

ద్రావిడ్ కెరీర్

ఈ క్ర‌మంలో 164 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ద్రావిడ్ 52 స‌గ‌టుతో 13288 ప‌రుగులు చేశాడు. ఇందులో 36 సెంచ‌రీలు, 63 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 5 సార్లు డ‌బుల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. అత్య‌ధిక స్కోర్ 270 ప‌రుగులు. ఓ వికెట్ తీశాడు. ఇక 344 వ‌న్డే మ్యాచ్‌లు ఆడి 39 స‌గ‌టుతో 10889 ప‌రుగులు చేశాడు.

ఇందులో 12 సెంచ‌రీలు, 83 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 153 ప‌రుగులు. 4 వికెట్లు కూడా తీశాడు. ఇక ఒక టీ ట్వంటీ మ్యాచ్ ఆడి 31 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 24 వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు. మొత్తంగా భార‌త జ‌ట్టు త‌ర‌ఫున 509 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 48 సెంచ‌రీలు సాధించాడు. ఐపీఎల్‌లో 89 మ్యాచ్‌లు ఆడాడు. 28 స‌గ‌టుతో 2174 ప‌రుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 75 ప‌రుగులు.

ఎక్కువ బంతులు ఎదుర్కొన్న బ్యాట‌ర్‌

ఎక్కువ బంతులు ఎదుర్కొన్న బ్యాట‌ర్‌

భార‌త జ‌ట్టులో స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత అత్య‌ధిక టెస్టు మ్యాచ్‌లు ఆడ‌డంతోపాటు స‌చిన్ త‌ర్వాత‌ అత్య‌ధిక సెంచ‌రీలు, ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా నిలిచాడు. వ‌న్డేలు, టెస్టుల్లో 10 వేల ప‌రుగులు పూర్తి చేసిన బ్యాట‌ర్‌గా నిలిచాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధికంగా 31,258 బంతులు ఆడిన బ్యాట‌ర్‌గా ప్ర‌పంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అత్య‌ధికంగా 44,152 నిముషాలు బ్యాటింగ్ చేసిన ఆట‌గాడిగా చెరిగిపోని రికార్డును సొంతం చేసుకున్నాడు.

ద్రావిడ్ రికార్డులు

ద్రావిడ్ రికార్డులు

టెస్టు క్రికెట్‌లో అత్య‌ధికంగా 72 భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పిన బ్యాట‌ర్‌గా ద్రావిడ్ నిలిచాడు. వ‌రుస‌గా నాలుగు టెస్టు ఇన్నింగ్స్‌ల‌లో సెంచ‌రీలు న‌మోదుచేసిన ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. అత్య‌ధిక క్యాచ్‌లు ప‌ట్టిన భార‌త ఫీల్డ‌ర్‌గా నిలిచాడు. వ‌న్డే క్రికెట్‌లో 300కు పైగా భాగ‌స్వామ్యాల‌ను రెండు సార్లు న‌మోదు చేశాడు. టెస్టు క్రికెట్‌లో 2001లో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌తో క‌లిసి ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 376 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశాడు. 1999 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా ద్రావిడ్ నిలిచాడు. కెరీర్‌లో ఆడిన తొలి 120 వ‌న్డే మ్యాచ్‌ల‌లో ఒక్క‌సారి కూడా డ‌కౌట్ కాని బ్యాట‌ర్ కూడా ద్రావిడే.

ద్రావిడ్ అందుకున్న అవార్డులు

ద్రావిడ్ అందుకున్న అవార్డులు

తన క్రికెట్ కెరీర్‌లో ద్రావిడ్ 1999 ప్రపంచకప్ సియెట్ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. 2000వ సంవ‌త్స‌రంలో విజ్డెన్ క్రికెటర్ అవార్డును అందుకున్నాడు. 2004లో ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది. అదే ఏడాది ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్‌ది అవార్డుకు కూడా ద్రావిడ్ ఎంపిక‌య్యాడు.

Story first published: Tuesday, January 11, 2022, 10:48 [IST]
Other articles published on Jan 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X