న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నోబాల్ వేసి రివ్యూ.. జడేజాపై నెటిజ‌న్స్ ఫైర్‌!!

Fans troll Ravindra Jadeja after taking review for No Ball

క్రైస్ట్‌చర్చ్‌: సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటన ముగిసింది. హెగ్లే ఓవల్‌ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో భారత్‌పై న్యూజిలాండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను కివీస్ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అంతకుముందు వ‌న్డే సిరీస్‌ను 3-0తో భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను సోష‌ల్ మీడియాలో భారత ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. మీమ్స్‌, కామెంట్ల‌తో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

<strong>జట్టంతా రాణించలేదు.. పంత్ ఒక్కడినే ఎందుకు బాధ్యుడిని చేయాలి: కోహ్లీ</strong>జట్టంతా రాణించలేదు.. పంత్ ఒక్కడినే ఎందుకు బాధ్యుడిని చేయాలి: కోహ్లీ

జ‌డేజా ఘోర తప్పిదం

జ‌డేజా ఘోర తప్పిదం

న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగిన 'సర్' రవీంద్ర జ‌డేజా ఘోర త‌ప్పిదానికి పాల్ప‌డ్డాడు. స్పిన్న‌ర్ అయి ఉండి నోబాల్ వేసాడు. ఓ బంతికి కివీస్ బ్యాట్స్‌మెన్ ఔట‌య్యాడ‌ని ఎంపైర్‌ను కోరగా.. అతడు నిరాకరించాడు. దీంతో జడేజా రివ్యూ తీసుకున్నాడు. ఇక రిప్లేలో జడేజా నోబాల్ వేసినట్టు తేలింది. అప్పటికే సంబరాలు చేసుకుంటున్న జడేజా.. రిప్లేలో తన తప్పిదం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జడేజా వైపు చూస్తూ వెళ్ళిపోయాడు.

నోబాల్ వేసి రివ్యూనా

నోబాల్ వేసి రివ్యూనా

'సర్' రవీంద్ర జ‌డేజా తప్పిదం కారణంగా టీమిండియా మూల్యం చెల్లించుకుంది. కివీస్ బ్యాట్స‌మెన్ బతికిపోవ‌డమే కాకుండా.. ఒక ర‌న్‌ను ఎక్స్‌ట్రాగా స‌మ‌ర్పించుకుంది. జడేజా వ్య‌వ‌హారంపై ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. గ‌తంలో కూడా జ‌డ్డూ నోబాల్స్ వేసి భార‌త విజ‌య అవ‌కాశాల్ని దెబ్బ‌తీశాడ‌ని గుర్తు చేస్తున్నారు. 'నోబాల్ వేసి రివ్యూ తీసుకుంటావా?' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'నీవల్ల ఎక్స్‌ట్రా ర‌న్‌ కూడా వచ్చింది' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు.

జడేజా సూపర్ ఫీల్డింగ్‌

జడేజా సూపర్ ఫీల్డింగ్‌

జడేజా ఫీల్డింగ్‌లోనూ అదరగొడతాడనే విషయం అభిమానులకు తెలిసిందే. రెండో రోజు ఆటలో జడ్డూ అసాధారణ ఫీట్‌తో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. షమీ వేసిన ఇన్నింగ్స్‌ 72వ ఓవర్‌ చివరి బంతిని వాగ్నర్‌ స్క్వేర్‌ లెగ్‌వైపు భారీ షాట్‌ ఆడాడు. గాల్లోకి లేచిన ఆ బంతి వేగం చూస్తే ఫోర్‌ పక్కా అనిపించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా మధ్యలోనే జడేజా అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. వాగ్నర్‌ షాక్‌లో ఉండిపోగా.. జడేజాను సహచరులు అభినందించారు.

కోహ్లీపై కూడా విమ‌ర్శ‌లు

ఈ సిరీస్‌లో దారుణంగా విఫ‌ల‌మైన విరాట్ కోహ్లీపై కూడా నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. ఫ్లాట్ పిచ్‌ల‌పై త‌ప్ప‌.. బౌన్సీ, ప‌చ్చిక‌తో కూడిన వికెట్ల‌పై కోహ్లీ తెలిపోతాడ‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈనెల 12 నుంచి ద‌క్షిణాఫ్రికాతో సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగే మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ ఫ్లాట్ వికెట్ల‌పై ఆడ‌నుంద‌ని, ఆ సిరీస్‌లో కోహ్లీ సెంచ‌రీలు చేస్తాడ‌ని ఎద్దేవా చేస్తున్నారు. బ‌ల‌మైన జ‌ట్ల‌పై భార‌త్ తేలిపోతుంద‌ని, జింబాబ్వే, శ్రీలంక‌లాంటి బ‌ల‌హీన‌మైన జ‌ట్ల‌తో సిరీస్‌లు ఏర్పాటు చేయాల‌ని బీసీసీఐని ఫాన్స్ కోరుతున్నారు. సొంత‌గ‌డ్డ‌పై మాత్రమే కోహ్లీ పులి అని విమర్శిస్తున్నారు.

Story first published: Monday, March 2, 2020, 16:28 [IST]
Other articles published on Mar 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X