న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ వార్త‌ల‌కు దూరంగా ఉంటున్నా.. ఎక్కువ‌గా చూస్తే..: డుప్లెసిస్‌

Faf du Plessis avoids reading too much news

కేప్‌టౌన్‌: క‌రోనా వైర‌స్ (కొవిడ్-19) మహమ్మారి పంజా విసురుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో తాను వార్త‌ల‌కు దూరంగా ఉంటున్నాన‌ని ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. క‌ష్ట ‌కాలంలో విప‌త్తుకు సంబంధించిన వార్త‌లు ఎక్కువ‌గా చూస్తే.. భావోద్వేగాల‌కు లోను కావ‌ల్సి ఉంటుందన్నాడు. ఈ కారణంగానే తాను వార్త‌ల జోలికి వెళ్ల‌డం లేద‌ని డుప్లెసిస్‌ చెప్పాడు.

ఆ కారణంగానే భారత జట్టులో రైనాకు మ‌ళ్లీ చాన్స్ రాలేదు: మాజీ సెలెక్ట‌ర్ ఎమ్మెస్కేఆ కారణంగానే భారత జట్టులో రైనాకు మ‌ళ్లీ చాన్స్ రాలేదు: మాజీ సెలెక్ట‌ర్ ఎమ్మెస్కే

'క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో వార్త‌ల‌కు దూరంగా ఉంటున్నా. సాధారణంగా నేను వార్తలను పరిమితంగానే చదువుతాను. అంత‌ర్జీతీయ స్థాయి ఆట‌గాళ్లుగా సానుకూల దృక్ప‌థంతో ఎలా ముందుకు సాగాలో తెలుసు. ఈ విప‌త్క‌ర స‌మ‌యాల్లో ఎక్కువ బాధాక‌ర విష‌యాల జోలికి వెళ్ల‌డం లేదు. అందుకే వార్త‌లు చూడం త‌గ్గించా. భవిష్యత్ గురించి భయమేస్తోంది. మళ్లీ ఎప్పుడు క్రికెట్ ఆడుతామో తెలియదు' అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.

గ‌తేడాది డుప్లెసిస్ సారథ్యంలోనే ఎన్నో అంచ‌నాల‌తో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా మెగా టోర్నీలో తీవ్రంగా నిరాశ‌ప‌ర్చింది. టోర్నీ అనంతరం భార‌త ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన ద‌క్షిణాఫ్రికా.. టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయింది. సొంత‌గ‌డ్డ‌పై ఇంగ్లాండ్ చేతిలోనూ ప‌రాజ‌యం పాలయింది. దీంతో డుప్లెసిస్.. కెప్టెన్సీకి గ‌త ఫిబ్ర‌వ‌రిలో రాజీనామా చేశాడు. 35 ఏళ్ల ఫాఫ్ డుప్లెసిస్ దక్షిణాఫ్రికా తరఫున 65 టెస్టులు, 143 వన్డేలు ఆడాడు. వన్డేల్లో 3,901.. టెస్టుల్లో 5,507 పరుగులు చేశాడు. ఇక 47 టీ20లలో 1,853 రన్స్ చేసాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 22 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు బాదాడు.

డుప్లెసిస్ రాజీనామా చేయ‌డానికి ముందు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కోచ్‌గా మార్క్ బౌచ‌ర్‌, డైరెక్ట‌ర్‌గా గ్రేమ్ స్మిత్ ఎంపిక‌య్యారు. ఇక వ‌రుస ప‌రాజ‌యాల‌తో త‌న‌పై విప‌రీత‌మైన ఒత్తిడి నెల‌కొంద‌ని డుప్లెసిస్ తెలిపాడు. కెప్టెన్సీ వదులుకోడానికి అసలు కార‌ణాలు స్ప‌ష్టంగా చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ.. కఠిన ప‌రిస్థితుల వ‌ల్ల రాజీనామా నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు.

'కొత్త టీమ్ హెడ్స్, యువ ఆటగాళ్ల‌తో జట్టు కొత్త దిశలో పయనిస్తున్నప్పుడు, అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకోవడం దక్షిణాఫ్రికా క్రికెట్ మంచిదని నేను భావించాను. ఇది చాలా కఠినమైన నిర్ణయమే. కానీ క్వింటన్ డికాక్‌కు, నా సహచర ఆటగాళ్లకు మద్దతుగా నిలబడటానికి నేను కట్టుబడి ఉన్నా. మేమంతా జట్టు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తాం' అని డుప్లెసిస్ తెలిపాడు. డుప్లెసిస్ స్థానంలో వైట్‌బాల్ క్రికెట్ కెప్టెన్‌గా క్వింట‌న్ డికాక్‌ను ఎంపిక చేశారు. అయితే ఇంకా టెస్టు కెప్టెన్‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూప‌ర్ కింగ్స్ తరపున ఫాఫ్ ఆడుతున్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, May 5, 2020, 19:06 [IST]
Other articles published on May 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X