న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త కలయిక యూజర్లకు పండుగే: ఐసీసీతో చేతులు కలిపిన ఫేస్‌బుక్

 Facebook joins hands with ICC, range of digital content to be available on social media platform

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఐసీసీ గ్లోబల్ ఈవెంట్స్‌కు సంబంధించిన డిజిటల్ కంటెంట్ రైట్స్ మొత్తం ఫేస్‌బుక్‌కు దక్కాయి. ఈ ఒప్పందం 2023 వరకు కొనసాగనుంది.

ఇందులో భాగంగా మ్యాచ్‌లకు సంబంధించిన రిక్యాప్‌లు, మ్యాచ్‌లోని ముఖ్య ఘట్టాలు, మ్యాచ్‌లకు సంబంధించిన ఇతర సమాచారం మొత్తం మనకు ఫేస్‌బుక్‌లో దొరుకుతుంది. ఈ కలయిక ఐసీసీ వరల్డ్‌కప్ 2019 తర్వాత డిజిటల్ విజయానికి దోహదపడుతుంది. అంతేకాదు ప్రపంచంలో క్రికెట్‌ను అత్యంత ఎక్కువ మంది వీక్షించే క్రీడగా తయారు చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్ విశేషాలను #CWC19 పేరిట ఐసీసీ డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో పోస్టు చేయగా 4.6 బిలియన్ వీడియో వ్యూస్ వచ్చాయి. ఈ నాలుగేళ్ల ఒప్పంద కాలంలో ఫేస్‌బుక్ గతంలో ఎన్నడూ లేని విధంగా మరింత కంటెంట్‌ను ఫేస్‌బుక్ తన వినియోగదారులతో ఎంగేజ్ చేయనుంది.

నవంబర్ వరకు ధోని సెలక్షన్‌కు అందుబాటులో ఉండకపోవడానికి కారణమిదే!నవంబర్ వరకు ధోని సెలక్షన్‌కు అందుబాటులో ఉండకపోవడానికి కారణమిదే!

ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సావ్నే మాట్లాడుతూ "ఫేస్‌బుక్‌ను క్రికెట్ కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచంలో అత్యధికంగా చూసే క్రీడ.. ప్రపంచంలో అత్యధికంగా వాడే వేదిక ఒకటి కావడమే ఈ కలయిక. భవిషత్తులో ఎటువంటి విశేషాలు చోటు చేసుకుంటాయో అని ఆసక్తిగా ఉంది" అని అన్నారు.

"ఈ ఒప్పందం దక్కించుకొనేందుకు నిర్వహించిన వేలంలో క్రికెట్‌కి ఉన్న ప్రాధాన్యత తెలిసిన చాలా సంస్థలు పాల్గొన్నాయి. అయితే ఫేస్‌బుక్ ద్వారా మా నిజమైన లక్ష్యం చాలా మంది ప్రజలకు చేరుతుంది" అని ఆయన చెప్పుకొచ్చారు. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందని ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ వీపీ అన్నారు.

"ఐసీసీతో కలిసి ఒప్పందం చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. క్రికెట్‌ని సాంకేతికపరంగా మరింత అభివృద్ధి చేసేందుకు మెరుగైన టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్నప్ ద్వారా స్పోర్ట్ అభిమాలకు ఆటను మరింత మంది అభిమానులకు చేరువయ్యేలా కృషి చేస్తాం" అని తెలిపారు.

Story first published: Thursday, September 26, 2019, 18:32 [IST]
Other articles published on Sep 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X