న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: విండీస్‌ హిట్టర్‌ను దక్కించుకున్న రాజస్తాన్‌.. ఇక పరుగుల వరదే!!

Evin Lewis and Oshane Thomas to join Rajasthan Royals for the remainder of IPL 2021

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశకు సమయం ఆసన్నమైంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది. గత సీజన్‌ మాదిరిగానే దుబాయ్‌, షార్జా, అబుదాబిలో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి. సెప్టెంబరు 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభం కానున్నాయి. మెగా టోర్నీ కోసం ఇప్పటీకే అన్ని జట్లు యూఏఈ చేరుకొని ముమ్మర సాధన చేస్తున్నాయి. మరోవైపు ఐపీఎల్ పార్ట్-2 నుంచి పలువురు ఆటగాళ్లు వివిధ కారణాలు చేత తప్పుకోవడంతో ఆయా ఫ్రాంచైజీలు వారి స్థానాలను భర్తీ చేసే పనిలో బిజీగా ఉన్నాయి.

ఐపీఎల్ 2021 రెండో దశ నుంచి పలువురు స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాలు చేత తప్పుకున్నారు. కొన్ని జట్లలో స్టార్ ప్లేయర్స్ అందుబాటులో ఉండడం లేదు. దాంతో ఆయా ఫ్రాంచైజీలు వారి స్థానాలను భర్తీ చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇదివరకే చాలా జట్లు రిప్లేస్‌మెంట్‌ ఆటగాళ్లును ఎంపిక చేసుకున్నాయి. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరమైనా జోస్‌ బట్లర్‌ స్థానాన్ని వెస్టిండీస్ హిట్టర్ ఎవిన్‌ లూయిస్‌తో భర్తీ చేయాలని నిర్ణయించింది. గాయం కారణంగా లీగ్‌ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ప్లేస్‌ను విండీస్‌కే చెందిన ఒషేనే థోమాస్‌తో రీప్లేస్‌ చేయనున్నట్లు ప్రకటించింది.

వైడ్ ఇవ్వని అంపైర్.. అసహనం వ్యక్తం చేసిన కీరన్ పొలార్డ్! అలా నడుచుకుంటూ వెళ్లి (వీడియో)!!వైడ్ ఇవ్వని అంపైర్.. అసహనం వ్యక్తం చేసిన కీరన్ పొలార్డ్! అలా నడుచుకుంటూ వెళ్లి (వీడియో)!!

ఎవిన్‌ లూయిస్‌ గతంలో ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆడాడు. 16 మ్యాచ్‌ల్లో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 131 స్ట్రయిక్‌ రేట్‌తో 430 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. ఎవిన్‌ లూయిస్‌కు అంతర్జాతీయ టీ20ల్లో హార్డ్‌ హిట్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. అతను విండీస్‌ తరఫున 45 మ్యాచ్‌ల్లో 158 స్ట్రయిక్‌ రేట్‌తో 1318 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయి. క్రీజులోకి రావడమే ఆసల్యం బంతిని బాదడమే అతనికి తెలిసింది. తుది జట్టులో లూయిస్‌ కచ్చితంగా ఉండనున్నాడు. ఇక గతంలో ఒషేనే థోమాస్‌ ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు 4 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. అతడు కూడా కీలక ఆటగాడే.

సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు ఐపీఎల్‌ సెకెండ్‌ లెగ్‌లో తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 21న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌.. పంజాబ్‌ కింగ్స్‌ను ఢీకొంటుంది. ప్రస్తుత సీజన్‌లో రాజస్తాన్‌ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 29 మ్యాచ్‌లు ముగిసాయి. అప్పటికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), నాలుగులో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి.

Story first published: Wednesday, September 1, 2021, 12:31 [IST]
Other articles published on Sep 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X