న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుక్.. చివరి టెస్టుకు ముందే రిటైర్ అవ్వాలనుకున్నాడట!!

England opener bows out at the right time after century v India

హైదరాబాద్: కొద్ది రోజుల ముందు ప్రకటించి అనుకున్న సమయానికే కుక్ రిటైర్‌మెంట్ ప్రకటించాడని అనుకుంటున్నారు. కానీ, నిజానికీ కుక్ ఆఖరి టెస్టు కూడా ఆడదామనుకోలేదట. భారత్‌తో చివరి టెస్టుకు ముందే ఇంగ్లాండ్‌ ఆటగాడు అలిస్టర్‌ కుక్‌ రిటైరవుదామని అనుకున్నాడట. కానీ, ఆ జట్టు కోచ్‌ ఒప్పుకోకపోవడంతో కుక్‌ భారత్‌తో ఐదో టెస్టు ఆడినట్లు సమాచారం.

భారత్‌తో జరిగే చివరి టెస్టులో కుక్‌ ఆడాలని అనుకోలేదట:

భారత్‌తో జరిగే చివరి టెస్టులో కుక్‌ ఆడాలని అనుకోలేదట:

ఇంగ్లాండ్‌లోని ఓ ఇంగ్లిష్‌ మీడియా కథనం ప్రకారం... ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగే చివరి టెస్టులో కుక్‌ ఆడాలని అనుకోలేదు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు తర్వాతే కుక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించేద్దామని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు సెలక్టర్‌ ఎడ్‌ స్మిత్‌ను కూడా కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కానీ, స్మిత్‌ అందుకు ఒప్పుకోలేదు. భారత్‌తో చివరి టెస్టు ఆడాలని కోరి.. ఆ టెస్టు ఆడే జట్టులో కుక్‌ పేరు కూడా జత చేశాడు. దాంతో కుక్‌ చివరి టెస్టులో సభ్యుడయ్యాడు.

 అతని భార్య కోసమే కుక్ రిటైర్ అవ్వాలని:

అతని భార్య కోసమే కుక్ రిటైర్ అవ్వాలని:

ముందుగానే కుక్‌ ఎందుకు రిటైరవ్వాలనుకున్నాడంటే... అతడి భార్య ఎలైస్‌ ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఏ నిమిషంలోనైనా ఆమె బిడ్డకు జన్మనివ్వొచ్చు. ఇలాంటి సమయంలో ఆమె వెన్నంటే ఉండాలని భావించిన కుక్ చివరి టెస్టుకు అందుబాటులో ఉండలేనని స్మిత్‌ను కలిసినప్పుడు చెప్పాడట. భారత్‌తో ఐదో టెస్టు నాలుగో రోజు ఆటకి కుక్‌ భార్య ఎలైస్‌ ఇద్దరు బిడ్డలతో కలిసి హాజరైంది. కుక్‌ సెంచరీ సాధించగానే ఎలైస్‌ చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకుంది.

ముందుగానే రిటైర్మెంట్‌ గురించి వెల్లడించా

ముందుగానే రిటైర్మెంట్‌ గురించి వెల్లడించా

వారం రోజులు ముందుగానే నా రిటైర్మెంట్‌ గురించి వెల్లడించాను. ఈ వారం రోజులు నాకు ఎంతో ప్రత్యేకంగా గడిచాయి. ముఖ్యంగా భారత్‌తో ఐదో టెస్టు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రోజులు మరీ ప్రత్యేకంగా మారాయి. ఫీల్డింగ్‌ చేసే సమయంలో బార్మీ ఆర్మీ పాటలు పాడుతూ నన్ను ఎంతో ప్రోత్సహించింది. ఈ మ్యాచ్‌ చూసేందుకు నా భార్య, పిల్లలు, స్నేహితులు చాలా మంది వచ్చారు.

చివరి సెంచరీ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే:

చివరి సెంచరీ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే:

చివరి టెస్టులో సెంచరీ సాధించాలని నేను అసలు అనుకోలేదు. వ్యక్తిగత స్కోరు ఎనభైల్లో ఉన్న సమయంలో సెంచరీ గురించి ఆలోచించాను. నాసర్‌ హుస్సేన్‌ తన చివరి మ్యాచ్‌లో సెంచరీ సాధించినప్పుడు చూసినప్పుడు కెరీర్‌ను చాలా బాగా ముగించాడని అనుకున్నాను. ఇప్పుడు కూడా చివరి టెస్టులో సెంచరీ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సెంచరీ ఎప్పటికీ ప్రత్యేకమే. మనం కన్న కలలు ఎప్పుడో ఒకసారే నెరవేరతాయని కుక్‌ ఉద్వేగంగా మాట్లాడాడు.

Story first published: Tuesday, September 11, 2018, 13:02 [IST]
Other articles published on Sep 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X