పాండ్యాతో మీరు డేటింగ్ చేస్తున్నారా..? పని మానుకుని సమాధానాలు చెప్పను

Posted By: Subhan
Elli AvrRam on link-up rumours with Hardik Pandya: Let them be curious, why do I need to clarify anything?

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ కంటెస్టంట్ ఎల్లి అవరమ్ భారత జట్టు ఆల్ రౌండర్‌తో డేటింగ్ చేస్తుందంటూ రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై ఆమెని వివరణ అడగగా.. నేను పని మానుకుని మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసర్లేదు అని కొట్టి పడేసింది.

గతేడాది పాండ్యా అన్న కృనాల్ పాండ్యా వివాహ వేడుకకు హాజరైన ఎల్లి అవరమ్ పాండ్యాతో చనువుగా వ్యవహరించింది. అంతేగాక తర్వాత జరిగిన ధావన్ కూతురు 13వ పుట్టినరోజుకు కూడా వచ్చి అక్కడ ఉన్న వాళ్లని ఆశ్చర్యపరిచింది.

ఇటీవలే మీడియాతో మాట్లాడిన ఆమె ..' మా గురించి తెలుసుకోవాలని అంత కుతూహలంగా ఉందా..? అసలు నేనెందుకు మీకు సమాధానం చెప్పాలి.. ? కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి రూమర్లు వింటున్నా. ఇప్పుడు వాటన్నింటికి తీరిగ్గా కూర్చుని సమాదానం చెప్పేంత సమయం నాకు లేదు. సెలబ్రిటీ అంటే చాలు. ఏం చేసినా వార్త అయిపోతుంది. ఇప్పుడు నాకు హార్ధిక్ పాండ్యాకు మధ్య ఏమీ లేదని చెప్పినా నేనేదో దాస్తున్నానంటూ మళ్లీ రూమర్లు వస్తాయి. అందుకనే నేను వాటిపై స్పందించదలచుకోలేదు' అని మీడియాపై మండిపడింది.

అంతకుముందు జరిగిన ఓ విషయాన్ని ఎల్లి గుర్తు చేసుకుంది. క్రిస్టమస్‌కు ముందు రోజు తను, వాళ్ల అన్నతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిందట. డిన్నర్ ముగించుకుని తిరిగొస్తుంటే చూసిన జనం. ఎల్లీకి సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ వార్తలు రాసుకొచ్చారట. రెండో రోజు అవన్నీ చూసుకుని నవ్వుకున్నామంటూ పేర్కొంది.

'నేను నా కుటుంబంతో సన్నిహితంగానే ఉంటాను. నా గురించి జరిగినవన్నీ వాళ్లతో పంచుకుంటాను. ఇలాంటి రూమర్ల గురించి నేను బాధపడాల్సిన అవసర్లేదు. ఎందుకంటే మా నాన్నే చెప్తుంటారు. ఇలాంటి వాటికి చిరునవ్వే సమాధానం అని. నేను టీనేజ్ లో ఉన్నప్పుడు చేతికి ఉంగరం చూసి నాకు పెళ్లి అయిపోయింది అన్నారు. అప్పుడు నేను అవును దేవుడితో పెళ్లి జరిగిపోయిందని సర్ధి చెప్పుకున్నాను. ఇప్పుడు కూడా ఎవరైనా అడిగితే అవును దేవుడితో నా పెళ్లి కుదిరిపోయిందని సమాధానం చెప్తా అంటూ మాట దాటేసింది' బాలీవుడ్ మోడల్ ఎల్లి అవరమ్.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 12, 2018, 16:22 [IST]
Other articles published on Feb 12, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి