న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : ప్రాక్టీస్‌లో మా ఫోకస్ అంతా దానిపైనే: రాహుల్ ద్రావిడ్

Dravid reveals Team India focus in Practice sessions

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు గట్టిగా సిద్ధం అవుతోంది. ఇప్పటికే వీసీఏ మైదానానికి చేరుకున్న టీం ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తమ ప్రాక్టీస్ విధానాలను వివరించాడు. తాము ముఖ్యంగా ఫీల్డింగ్‌పై ఫోకస్ పెట్టామన్నాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్, క్యాచులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించాడు.

ఫీల్డింగ్ సమస్య..

కొంత కాలంగా భారత ఫీల్డింగ్ కొంత ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల్లో అయితే స్లిప్స్‌లో ఫీల్డింగ్ అంతగా ఆకట్టుకోవడం లేదు. దీనిపై పలువురు మాజీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్లిప్స్‌లో అత్యధిక క్యాచులు అందుకున్న ద్రావిడ్ కింద ప్రాక్టీస్ చేస్తూ.. భారత ఆటగాళ్లు ఇలా స్లిప్స్‌లో ఫెయిలవడం ఏమాత్రం బాగాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఫీల్డింగ్‌పై భారత జట్టు బాగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు భారత జట్టులో స్లిప్స్ ఫీల్డింగ్ విభాగాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ద్రావిడ్ వెల్లడించాడు.

ప్రాక్టీస్ చాలా అవసరం..

ప్రాక్టీస్ చాలా అవసరం..

'అందరూ మంచి షేప్‌లో ఉన్నారు. టెస్టు టీం అంతా ఒకచోటకు చేరుకోవడం చాలా బాగుంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ మాతరమే ఆడాం' అని ద్రావిడ్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'కొంత మంది ఆటగాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి టెస్టులకు తమ ఆటను మార్చుకోవాల్సి ఉంది. దీని కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. ఆ సమయం ఇప్పుడు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి పిచ్‌లు కూడా చాలా బాగున్నాయి' అని ద్రావిడ్ వివరించాడు.

ఇప్పుడు వాటిపై ఫోకస్..

ఇప్పుడు వాటిపై ఫోకస్..

ప్రస్తుతం భారత జట్టు విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోని సివిల్ లైన్స్ వద్ద ట్రైనింగ్ చేస్తోంది. ఇదే వీసీఏ జంథా స్టేడియంలో గురువారం నాడు భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మొదలవుతుంది. 'ఆటలో ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యం కదా.

అందుకే క్లోజ్ ఇన్ క్యాచింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. దీంతోపాటు స్లిప్ ఫీల్డింగ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టాం. వరుసపెట్టి మ్యాచులు ఆడుతున్నప్పుడు ఫోకస్ చెయ్యలేని అంశాలపై ఇప్పుడు దృష్టిపెట్టాం. చాలా కాలం తర్వాత ఇలా సిరీస్ ముందు వారం పాటు తీరిక దొరకడం చాలా సంతోషంగా ఉందని, దీన్ని ప్రాక్టీస్‌కు చక్కగా ఉపయోగించుకుంటున్నామని చెప్పాడు.

Story first published: Sunday, February 5, 2023, 17:51 [IST]
Other articles published on Feb 5, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X