న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2020 ఆసియా కప్ పాక్ ఆతిథ్యం: టీమిండియా ఆడుతుందా లేదా?

Doubts over Team India’s participation as Pakistan set to host Asia Cup 2020

హైదరాబాద్: 2020లో జరగనున్న ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయం తీసుకుంది. సింగపూర్ వేదికగా బుధవారం జరిగిన ఏసీసీ మీటింగ్‌లో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్‌ బోర్డులకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆసియా దేశాల మధ్య ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఆసియా కప్‌ గతేడాది యూఏఈ వేదికగా జరిగింది. పైనల్లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా బంగ్లాదేశ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ 15వ ఎఢిషన్ కావడం విశేషం. ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది.

టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో

టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్‌ను ముందుగా నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఆసియా కప్‌లో టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకు జరిగిన 14 ఎడిషన్లలో టీమిండియా ఏడు సార్లు విజేతగా నిలిచింది. చివరగా రెండు సార్లు ఆసియా కప్‌ను టీమిండియానే గెలిచింది.

ఆసియా కప్‌ని పాకిస్థాన్‌లో

ఆసియా కప్‌ని పాకిస్థాన్‌లో

అయితే, ఆసియా కప్‌ని పాకిస్థాన్‌లో నిర్వహిస్తుండటంతో టీమిండియా పాల్గొంటుందా లేదా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతుంది. పాకిస్థాన్-బారత్‌ల మధ్య నెలకొన్ని విబేధాల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగని సంగతి తెలిసిందే. చివరిగా 2008లో భారత్ పాకిస్థాన్‌లో పర్యటించింది.

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో

ఆ తర్వాత నుంచి ఇరు జట్లు ఐసీసీ టోర్నీల్లో ఆడటం తప్ప మరెక్కడా తలపడలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడి ఇరు దేశాల మధ్య దూరాన్ని మరింతగా పెంచింది. ఇంగ్లాండ్ వేదికగా గురువారం నుంచి ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో కూడా పాక్‌తో మ్యాచ్‌ని కోహ్లీసేన బాయ్ కాట్ చేయాలని ఇప్పటికే ఎంతో మంది సూచించారు.

వేదిక విషయంలో ఏం జరుగుతుందో

వేదిక విషయంలో ఏం జరుగుతుందో

అయితే, వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడకుండా ఆ జట్టుకు రెండు పాయింట్లు ఇచ్చే దానికి బదులు మ్యాచ్ ఆడి ఆ జట్టుని ఓడిస్తే యావత్ భారతవని ఎంతో సంతోషిస్తుందని మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పుడు, ఆసియా కప్ వేదిక విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Story first published: Wednesday, May 29, 2019, 19:12 [IST]
Other articles published on May 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X