న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెల్‌బోర్న్ పిచ్‌పై ఎంసీజీ చీఫ్‌ క్యూరేటర్‌ ఏమన్నారో తెలుసా!

 Dont get fooled by grass on MCG pitch: Marcus Harris

హైదరాబాద్: గత పొరపాట్లను సరిదిద్దుకుని ఈసారి జీవమున్న పిచ్‌ను రూపొందించామని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) చీఫ్‌ క్యూరేటర్‌ మాథ్యూ పేజ్‌ తెలిపాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం నుంచి మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తోన్న టీమిండియా(వీడియో)నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తోన్న టీమిండియా(వీడియో)

ఈ నేఫథ్యంలో చీఫ్‌ క్యూరేటర్‌ మాథ్యూ పేజ్‌ మాట్లాడుతూ గత పొరపాట్లను సరిదిద్దుకుని జీవమున్న పిచ్‌ను రూపొందించామని తెలిపాడు. "పిచ్‌పై పచ్చిక ఉంటుందని, ఆరంభంలో పేసర్లకు.. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది" అని చెప్పాడు. గతేడాది యాషెస్‌ టెస్టు సందర్భంగా ఎంసీజీ పిచ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

1
43625

ఎంసీజీ పిచ్‌‌కు ఐసీసీ పేలవ రేటింగ్

ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ టెస్టు డ్రాగా ముగిసింది. అనంతరం ఎంసీజీ పిచ్‌‌కు ఐసీసీ పేలవ రేటింగ్‌ ఇచ్చింది. మరోవైపు ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హ్యారిస్ మాత్రం ఓపిగ్గా ఆడితే పరుగుల వరద పారించవచ్చని, పిచ్‌పై పచ్చిక చూసి మోసపోవద్దని తెలిపాడు. ఇప్పటికే ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇరు జట్ల చెరో టెస్ట్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది.

మూడు మార్పులతో బరిలోకి టీమిండియా

మూడు మార్పులతో బరిలోకి టీమిండియా

ఇదిలా ఉంటే, బాక్సింగ్ డే టెస్టుకు జట్టు మేనేజ్‌మెంట్ టీమిండియాను మంగళవారం ప్రకటించింది. జట్టులో ఏకంగా మూడు మార్పులు చేసింది. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్‌లను టీమ్‌లో నుంచి తొలగించడం విశేషం.

 అశ్విన్ దూరం, మయాంక్ అరంగేట్రం

అశ్విన్ దూరం, మయాంక్ అరంగేట్రం

మరోవైపు స్పిన్నర్ అశ్విన్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మూడో టెస్టుకూ దూరమయ్యాడు. పేస్‌ర్ ఉమేష్ యాదవ్‌ను కూడా తప్పించారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌కు చోటు కల్పించారు. మయాంక్ తన తొలి టెస్ట్ ఆడబోతున్నాడు.

మెల్‌బోర్న్ టెస్ట్‌కు టీమిండియా ఇదే:

విరాట్ కోహ్లి, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, చెతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Tuesday, December 25, 2018, 12:22 [IST]
Other articles published on Dec 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X