న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ అవకాశం వస్తే ముందు ధోనీ బుర్రనే చదువుతా: దినేశ్ కార్తీక్

Dinesh Karthik reveals he would love to read MS Dhonis mind

న్యూఢిల్లీ: తనకు ఇతరుల బుర్రలు చదివే అవకాశం వస్తే ముందుగా టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీపై ఆ అస్త్రాన్ని సంధిస్తానని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో బెంగళూరు తరఫున దుమ్మురేపిన అతను తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికాతో రెండో టీ20కి ముందు బీసీసీఐ విడుదల చేసిన ఓ వీడియోలో దినేశ్ కార్తీక్ సరదాగా మాట్లాడాడు. ఈ వీడియోలో డీకేను పలు ప్రశ్నలు అడగ్గా.. సరదాగా సమాధానాలిచ్చాడు.

టీ అంటే ఇష్టం..

టీ అంటే ఇష్టం..

జట్టుతో డిన్నర్‌ చేయడం ఇష్టమా? సినిమాకు వెళ్లడం ఇష్టమా? అని అడగ్గా.. టీమ్‌ డిన్నర్‌ అంటేనే చాలా ఇష్టమని తెలిపాడు. సహచర ఆటగాళ్లతో భోజనం చేయడం బాగుంటుందని చెప్పాడు. టీ ఇష్టమా? కాఫీ ఇష్టమా? అంటే.. టీ ఇష్టమని, భారత దేశంలో ఏ మూలకెళ్లినా దొరుకుతుందన్నాడు. ఏదైనా పార్టీలో పాడటం ఇష్టమా? లేక డ్యాన్స్‌ చేయడం ఇష్టమా? అని అడిగితే ఇది చాలా కష్టమైన ప్రశ్నని, తాను రెండింటిలో ఏదీ చేయలేనని చెప్పాడు. పర్వత ప్రాంతాలా? బీచ్‌లు ఇష్టమా?అని ప్రశ్నిస్తే.. పర్వత ప్రాంతాలే ఇష్టమని, నేను ఎక్కడ హిల్‌స్టేషన్‌కు వెళ్లినా.. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని తెలిపాడు.

ధోనీ బుర్ర చదివేస్తా..

ధోనీ బుర్ర చదివేస్తా..

వంట చేయడమా? లేక ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇష్టమా? అంటే.. ఇంటిని శుభ్రం చేయడానికే ప్రాధాన్యతనిస్తానన్నాడు. శుభ్రంగా ఉండటం తనకు ఇష్టమని చెప్పాడు. మీకు ఎగిరిపోవడం ఇష్టమా? లేక ఎవరిదైనా బుర్ర చదవడం ఇష్టమా? అంటే.. నాకు ఎగిరిపోయే అవకాశం వస్తే అలస్కా (అమెరికా) వెళ్లిపోతానని, ఆ ప్రాంతం గురించి చాలా విషయాలు విన్నానని తెలిపాడు. అదే ఇతరుల బుర్ర చదివే అవకాశం వస్తే ధోనీ మైండ్‌ను చదివేస్తానన్నాడు. క్రిస్టియానో రొనాల్డో ఇష్టమా? లియోనెల్‌ మెస్సీనా? అంటే.. మెస్సీ అంటే చాలా ఇష్టమని, అతడి ఆటను చూడటం మహా ఇష్టమన్నాడు.

సినిమా తీయడమే ఇష్టం..

సినిమా తీయడమే ఇష్టం..

రోజర్‌ ఫెదరర్‌?రఫెల్‌ నాదల్‌? అంటే ఫెదరర్‌ అని చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లేదా ట్విటర్ గురించి అడిగితే.. ట్విటర్‌కే ఓటేస్తానన్నాడు. ఫోన్‌ లేకుండా ఒకరోజు ఉంటారా? లేక వ్యాయామం చేయకుండా ఉంటారా? అంటే.. ఫోన్‌ లేకుండా ఉండటమే నాకు తేలికైన పనని చెప్పాడు. దానికి అంతగా బానిస కాలేదన్నాడు. లంబోర్గిని కారు ఇష్టమా లేక మస్టాంగ్‌ కారు ఇష్టమా? అంటే.. లంబోర్గిని అంటేనే ఇష్టమని, దాని నుంచి వచ్చే శబ్దం బాగుంటుందన్నాడు. జీవితం మీద పుస్తకం రాయడం ఇష్టమా? సినిమా తీయడం ఇష్టమా? అంటే సినిమా అయితే బాగుంటుందన్నాడు.

Story first published: Monday, June 13, 2022, 13:19 [IST]
Other articles published on Jun 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X