న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండిస్ పర్యటనకు ధోని దూరం: రెండు నెలలు క్రికెట్‌కు సెలవు, ఆర్మీకి సేవలు

Dhoni Opts Out Of West Indies Tour, To Serve Army For Two Months || Oneindia Telugu
Dhoni opts out of West Indies tour; to serve territorial army for two months

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనకు తాను అందుబాటులో ఉండనని బీసీసీఐకి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముందే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్ వార్తలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టెరిటోరియల్‌ ఆర్మీ పారాచూట్‌ రెజిమెంట్‌లో ధోనీ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "మూడు విషయాలపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. ధోని తనకు తానుగా వెస్టిండీస్‌ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. మరో రెండు నెలలు పారామిలటరీ రెజిమెంట్‌లో చేరి సేవలందిస్తాడు. ప్రస్తుతం ధోని తన ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించడం లేదు" అని అన్నారు. విండిస్ పర్యటన కోసం టీమిండియాను ఎంపిక చేసేందుకు ఆదివారం సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది.

రెండు నెలలు ఆర్మీకి సేవలు

రెండు నెలలు ఆర్మీకి సేవలు

ఈ రెండు నెలలు ఆర్మీకి సేవలు అందించనున్నట్లు లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిని ధోని పేరొన్నట్లు ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని బీసీసీఐ సైతం అధికారికంగా ద్రుృవీకరించింది. ఈ రెండు నెలలు ధోని పారాచూట్‌ రెజిమెంట్‌ విభాగంలో చేరి దేశ సైనికుడిగా సేవలందిస్తుడాని తెలిపింది.

బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ

బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ

ఈ మేరకు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "ధోని తనకు తానుగా వెస్టిండీస్‌ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. మరో రెండు నెలలు పారామిలటరీ రెజిమెంట్‌లో చేరి సేవలందిస్తాడు. ప్రస్తుతం ధోని తన ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించడం లేదు" అని అన్నారు. విండిస్ పర్యటన కోసం టీమిండియాను ఎంపిక చేసేందుకు ఆదివారం సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది.

ఈ సమావేశానికి ముందే

ఈ సమావేశానికి ముందే

ఈ సమావేశానికి ముందే ధోని ఈ విషయాన్ని వెల్లడించనట్లు ఆయన తెలిపారు. ధోని నిర్ణయాన్ని జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు ఛీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌కు తెలియజేశామని ఆయన అన్నారు. దీంతో ధోని స్థానంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను... టెస్టులకు వృద్ధిమాన్‌ సాహా పేరును సెలక్టర్లు పరిశీలించనున్నారు.

2015 ప్రపంచకప్ నుంచి ధోని డౌన్ ఫాల్

2015 ప్రపంచకప్ నుంచి ధోని డౌన్ ఫాల్

2015 ప్రపంచకప్ నుంచి ధోని డౌన్ ఫాల్ మొదలైంది. 2016, 2018లలో ధోని పేలవ ప్రదర్శన చేశాడు. 2016లో ధోని 10 ఇన్నింగ్స్‌ల్లో 27.8 యావరేజితో 278 పరుగులు చేయగా... 2018లో 13 ఇన్నింగ్స్‌లాడి 25 యావరేజితో 275 పరుగులు చేశాడు. ఇక, 2017లో మాత్రం 60.61 యావరేజిని నమోదు చేశాడు.

గత నాలుగేళ్లుగా

గత నాలుగేళ్లుగా

గత నాలుగేళ్లుగా ధోని ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఇక, ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత ధోనిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. స్లో బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారుతున్న ధోని ఇక ఆటకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేసారు.

Story first published: Saturday, July 20, 2019, 15:15 [IST]
Other articles published on Jul 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X