న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్యాన్స్‌కు శుభవార్త: ఇప్పట్లో ధోని రిటైర్ అవ్వడం లేదు, జిమ్‌లో ట్రైనింగ్ మొదలుపెట్టాడు

Dhoni may not be retiring just now; to start training with Jharkhand U-23 side

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టీమిండియా తరుపున బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. తాజాగా, ధోని తన ట్రైనింగ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాంచీలోని ఓ జిమ్‌లో ధోని కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది.

అక్టోబర్ 31 నుంచి జాతీయ ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధోని ట్రైనింగ్‌లో జార్ఖండ్ అండర్-23 జట్టు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భాగంగా జార్ఖండ్ అండర్-23 జట్టు తమ తొలి మ్యాచ్‌లో భాగంగా కేరళతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం జార్ఖండ్ అండర్-23 జైపూర్‌కు బయల్దేరి వెళ్లనుంది.

<strong>అధిగమిస్తాడా?: బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ముందున్న సవాళ్లివే!</strong>అధిగమిస్తాడా?: బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ముందున్న సవాళ్లివే!

సపోర్టింగ్ స్టాఫ్‌తో మాట్లాడిన ధోని

సపోర్టింగ్ స్టాఫ్‌తో మాట్లాడిన ధోని

"ధోని జార్ఖండ్ సీనియర్ జట్టుతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌తో మాట్లాడాడు. నవంబర్ 8 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు జార్ఖండ్ సీనియర్ జట్టు సూరత్‌కు బయల్దేరింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి జేఎస్‌సీఏ స్టేడియంలో ధోని ప్రాక్టీస్ చేస్తున్నాడు" అని తెలిపారు.

జిమ్‌లో కసరత్తులు

జిమ్‌లో కసరత్తులు

"జిమ్‌లో కసరత్తులు చేయడం ద్వారా ధోని తన ఫిట్‌నెస్ ట్రైనింగ్‌ను ప్రారంభించాడు. ఇందులో భాగంగా ధోని బ్యాడ్మింటన్, టెన్నిస్, బిలియర్డ్స్ ఆడాడు. జనవరి నుంచి కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు ధోని సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ధోని భాగస్వామ్యం కాలేదు" అని జేఎస్‌సీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ధోని రిటైర్మెంట్‌పై గంగూలీ

ధోని రిటైర్మెంట్‌పై గంగూలీ

మరోవైపు ధోని రిటైర్మెంట్‌పై బుధవారం బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన గంగూలీ సైతం స్పందించిన సంగతి తెలిసిందే. ధోని భారత జట్టుకు గర్వకారణమని, తన హయాంలో అతడికి సముచిత గౌరవం లభిస్తుందని సౌరవ్ గంగూలీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ

విజేతలు అంత త్వరగా

విజేతలు అంత త్వరగా

"విజేతలు అంత త్వరగా ముగించరని మీకందరికీ తెలుసు. ఆటలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వారిలో ధోనీ ఒకడు. అతడు భారత జట్టుకు గర్వకారణం. ధోనీ తన కెరీర్‌ గురించి ఏం ఆలోచిస్తున్నాడో, అతడి మదిలో ఏముందో నాకు తెలీదు. కెరీర్‌కు సంబంధించిన అతడి ప్రణాళికలు ఎలా ఉన్నాయో ? చర్చించాకే తెలుస్తుంది" అని దాదా పేర్కొన్నాడు.

వావ్‌ ధోనీ అంటారు

వావ్‌ ధోనీ అంటారు

"అతడు సాధించిందేంటో మీరు ఒకసారి కూర్చొని ఆలోచిస్తే వావ్‌ ధోనీ అంటారు. వీడ్కోలు ఎప్పుడు పలకాలన్నది అతడిపై ఆధారపడి ఉంటుంది. నేను రిటైర్మెంట్‌ ప్రకటించినప్పుడు ప్రపంచమంతా అలా చేయొద్దన్నది. మళ్లీ వచ్చి నేను నాలుగేళ్లు ఆడా. దిగ్గజాలకు ఎప్పుడూ ఘనమైన వీడ్కోలు దక్కుతుంది. నేనిక్కడ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుంది" అని గంగూలీ తెలిపాడు.

Story first published: Thursday, October 24, 2019, 15:17 [IST]
Other articles published on Oct 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X