న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైలో 4వ వన్డే: అరుదైన రికార్డు నెలకొల్పిన రోహిత్-ధావన్

Dhawan-Rohit opening partnership now better than Tendulkar and Sehwag

హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌ల జోడీ అరుదైన రికార్డు నెలకొల్పింది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనింగ్ జోడిగా అరుదైన రికార్డుని తమ ఖాతాలో వేసుకుంది.

<strong>పేలవరీతిలో ధావన్ ఔట్: తొడగొట్టిన బౌలర్, ట్విట్టర్‌లో విమర్శలు</strong>పేలవరీతిలో ధావన్ ఔట్: తొడగొట్టిన బౌలర్, ట్విట్టర్‌లో విమర్శలు

వన్డేల్లో సచిన్-గంగూలీల జోడీ తొలి వికెట్‌కు 6609 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాతి స్థానంలో సచిన్-సెహ్వాగ్ (3919) జోడి ఉండేది. అయితే బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో వన్డేలో తొలి వికెట్‌కు ఐదు పరుగులు జోడించగానే వీరిద్దరి జోడీ రెండో స్థానానికి ఎగబాకింది.

2002లో సచిన్-సెహ్వాగ్‌ల జోడీ ఓపెనింగ్ జోడీగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత పదేళ్లలో వీరిద్దరి జోడీ అత్యుత్తమ జోడీగా పేరు తెచ్చుకోవడంతో పాటు మొత్తం 93 ఇన్నింగ్స్‌ల్లో 3919 పరుగులు సాధించింది. ఇందులో 12 సెంచరీకి పైగా భాగస్వామ్యాలు ఉన్నాయి.

 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను దాటిగా ప్రారంభించింది. అయితే, ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి (38) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. 40 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 38 పరుగులు చేసిన ధావన్ పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు.

పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన పావెల్

కీమోపాల్ బౌలింగ్‌లో కీరన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్ వేసిన కీమో పాల్ బౌలింగ్‌లో బంతిని మిడ్‌వికెట్ దిశగా తరలించేందుకు ధావన్ ప్రయత్నించాడు. కానీ.. బంతి బ్యాట్‌కి సరిగా కనెక్ట్ కాకపోవడంతో.. నేరుగా బంతి వెళ్లి కీరన్ పొవెల్ చేతుల్లో పడింది.

నాలుగో వన్డేలో తొలి వికెట్‌కు 3986 పరుగులు

దీంతో ధావన్ తరహాలో తొడగొడుతూ బౌలర్ కీమో పాల్ సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్-ధావన్ జోడి నాలుగో వన్డేలో తొలి వికెట్‌కు 3986 పరుగులు జోడించారు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో గంభీర్-సెహ్వాగ్ జోడి ఉంది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 1870 పరుగులు జోడించారు. నాలుగో స్థానంలో సునీల్ గావస్కర్-శ్రీకాంత్ (1680) జోడి ఉంది.

2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ జోడీగా ధావన్-రోహిత్‌

ధావన్-రోహిత్‌లు 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ జోడీగా ప్రారంభించారు. ఈ ఐదేళ్లలో వీరి జోడి 13 సెంచరీకి పైగా భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులతో 162 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(195 సిక్సులు) రికార్డుని సమం చేశాడు.

Story first published: Monday, October 29, 2018, 17:19 [IST]
Other articles published on Oct 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X