న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్స్: హెలికాప్టర్ షాట్‌తో ధోనీని మురిపిస్తోన్న పాండ్యా (వీడియో)

 DC v MI: From Pandyas helicopter six to de Kock getting sold down the river, best moments from Mumbais win

హైదరాబాద్: 'హెలికాప్టర్‌ షాట్‌' అనగానే క్రికెట్ అభిమానులకు ఠక్కన గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్‌ ధోని. అయితే, ధోనీని అనుకరిస్తూ ఇటీవలి కాలంలో చాలా మంది ఈ హెలికాప్టర్ షాట్లను ఆడుతున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌కు చెందిన హార్ధిక్ పాండ్యా. ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్ విజయాల్లో పాండ్యా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో పాండ్యా పలు ముంబై మ్యాచ్‌ల్లో హెలికాప్టర్ షాట్ ఆడుతూ ధోనిని తలపిస్తున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

హెలికాప్టర్ షాట్‌ని సిక్స్‌గా

హెలికాప్టర్ షాట్‌ని సిక్స్‌గా

ఈ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ నెట్ ప్రాక్టీస్ సమయంలో హెలికాప్టర్ షాట్ ఆడిన వీడియోని పాండ్యా ట్విట్టర్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రబడా వేసిన చివరి ఓవర్‌లో హెలికాప్టర్‌ షాట్‌ ఆడిన పాండ్యా దానిని సిక్సర్‌గా మలిచాడు.

చప్పట్లతో స్వాగతించిన పొలార్డ్

పాండ్యా హెలికాప్టర్ షాట్ ఆడిన వెంటనే డగౌట్‌లో కూర్చున్న జట్టులోని సహచర ఆటగాడు కీరన్ పొలార్డ్ కూడా చప్పట్లతో స్వాగతించాడు. అయితే, ఆ తర్వాత బంతికే హార్ధిక్ పాండ్యా ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

168 పరుగులు చేసిన ముంబై

168 పరుగులు చేసిన ముంబై

మరోవైపు కృనాల్‌ పాండ్యా 26 బంతుల్లో 37(5 ఫోర్లు) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమైంది.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న పాండ్యా

ముంబై స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌(3/19), బుమ్రా(2/18) ధాటికి ఢిల్లీ టాపార్డర్ కుదేలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Story first published: Friday, April 19, 2019, 15:30 [IST]
Other articles published on Apr 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X