న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Danish Kaneria : టీ20ప్రపంచకప్‌లో భువీ వద్దు.. బంతి స్వింగ్ కాకుంటే అతని పని ఔటే..! భువీకి బదులు అతను బెటర్

Danish Kaneria Felt That Deepak Chahar is Better Than Bhuvi for T20 Worldcup

పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా భారత బౌలింగ్ లైనప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ జరిగే ఆస్ట్రేలియా పరిస్థితుల్లో బౌలింగ్ విషయానికి వస్తే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కంటే దీపక్ చాహర్‌ను తీసుకోవడం ఉత్తమమని పేర్కొన్నాడు. దీనిపై మరింత స్పష్టత ఇస్తూ.. పరిస్థితులు స్వింగ్‌కు గనుక సహకరించకపోతే.. భువనేశ్వర్ తన స్పెల్‌లో దారుణంగా దెబ్బతింటాడని డానిష్ చెప్పాడు. డెత్ ఓవర్ల సమయంలో భువనేశ్వర్ కుమార్ పేలవ ఫామ్ కారణంగా భువీని తీసుకోకపోవడమే ఉత్తమమన్నాడు. ఆసియా కప్ 2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, అలాగే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లలో 19వ ఓవర్లలో భువీ ఘోరాతి ఘోరంగా పరుగులిచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్లోను భువీ ఎక్స్ పెన్సివ్ బౌలర్‌గా మారిన సంగతి తెలిసిందే.

టీ20 ప్రపంచ‌కప్ 2022 కోసం టీమిండియా స్టాండ్‌బై ప్లేయర్లలో మహ్మద్ షమీతో పాటు దీపక్ కూడా ఉన్నాడు. ఇకపోతే భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. దీంతో అతను దూరమైతే షమీ, దీపక్ చాహర్‌లలో ఎవరైనా ఒకరు జట్టుకు ఎంపిక కావొచ్చు. ఇంతలో మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20లలోని రెండు, మూడు టీ20ల కోసం భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే సిరాజ్ ప్లేయింగ్ 11లో చోటు పొందడం దాదాపు కష్టమే. ఇకపోతే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి గేమ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక గౌహతిలో నేడు రెండో టీ20 జరగనుంది.
నేటి మ్యాచ్‌కు ఇరు తుది జట్ల అంచనా

భారత్ ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 : క్వింటన్ డికాక్, టెంబా బవుమా, రోసోవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టియన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, షమ్సీ, అన్రిచ్ నార్జ్

Story first published: Sunday, October 2, 2022, 15:38 [IST]
Other articles published on Oct 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X