న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌తో భారత్ ఢీ..: వార్మప్ మ్యాచ్ ప్రతీకారం తీర్చుకునేనా?

CWC19, India vs New Zealand Match: Prediction and Probable Playing 11, Preview, Time, Schedule

టాప్ జట్లు దక్షిణాఫ్రికాపై, ఆస్ట్రేలియాపై అద్భుత విజయాలు సాధించిన భారత్‌ గురువారం మరో కీలక మ్యాచ్‌కు రెడీ అయింది. ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ ఢీ కొననుంది. శ్రీలంక, ఆఫ్ఘన్, బంగ్లా జట్లపై విజయం సాధించి టోర్నీలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కివీస్ ఉంది. పేస్ బౌలింగ్ బలంతో కివీస్ విజయాల పరంపర కొనసాగిస్తుంటే.. బ్యాటింగ్, బౌలింగ్ తో భారత్ విజయాలను అందుకుంటోంది. బలాబలాలపరంగా చూస్తే భారత్‌ కివీస్ కంటే పటిష్టంగా ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఓపెనర్‌గా రాహుల్:

ఓపెనర్‌గా రాహుల్:

తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాట్స్‌మెన్ బాగా రాణించారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ సెంచరీలతో సత్తా చాటారు. అయితే ధవన్ గాయం కారణంగా దూరం కావడంతో ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రానున్నాడు. రాహుల్‌ తనకు లభించనున్న అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. హెన్రీ, బౌల్ట్, ఫెర్గూసన్, నీషమ్‌లతో కూడిన పటిష్ఠమైన పేస్ అటాక్ కలిగిన కివీస్‌ను ఎదుర్కోవాలంటే రాహుల్‌కు సవాలే. తొలి పది ఓవర్లు పిచ్ స్వింగ్‌కు సహకరించే అవకాశం ఉండడంతో ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్‌లో తొందరగానే ఔటైనా.. ఆసీస్‌పై 82 పరుగులు చేసి ఫామ్ అందుకున్నాడు.

నాలుగో స్థానంపై సందిగ్దత:

నాలుగో స్థానంపై సందిగ్దత:

ఓపెనర్‌గా రాహుల్ ఖాయమైపోవడంతో రాహుల్‌కు బదులుగా మిడిలార్డర్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే బుధవారం నెట్స్‌లో విజయ్‌ శంకర్‌ ఎక్కువసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. సీనియర్ దినేశ్‌ కార్తీక్‌ను కూడా ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాలుగో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ అవసరం కాబట్టి కార్తీక్‌ను ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆపై బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ధోనీ, మెరుపులతో పాండ్య జోరుమీదున్నారు. అయితే కేదార్‌ జాదవ్‌కు ఇంకా బ్యాటింగ్‌ అవకాశం సరిగా రాలేదు.

తుది జట్టులోకి షమీ?:

తుది జట్టులోకి షమీ?:

పేసర్లు బుమ్రా, భువనేశ్వర్ ఆసీస్‌తో మ్యాచ్‌లో ఫాంలోకి వచ్చారు. చెరో మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియాపై విజయంలో కీలక పాత్ర పోషించారు. పిచ్ పరిస్థితుల కారణంగా మరో పేసర్ మహ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. షమీ వస్తే.. చాహల్, కుల్‌దీప్‌లో ఎవరో ఒక్కరే మ్యాచ్ ఆడతారు. భీకరమైన హిట్టర్లతో కూడిన కివీస్‌కు కళ్లెం వేయాలంటే భారత బౌలర్లు సమిష్టిగా రాణించాలి.

మరో విజయంపై కన్ను:

మరో విజయంపై కన్ను:

న్యూజిలాండ్‌ కూడా మూడు విజయాలతో ఊపుమీదుంది. అయినా ఆ జట్టుకు సమస్యలు ఉన్నాయి. కివీస్‌కు ఓపెనింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. గత కొన్నేళ్లలో ఏ జోడి కూడా రాణించడంలేదు. గప్టిల్‌ గత రెండు మ్యాచ్‌లలోనూ విఫలమయ్యాడు. మున్రోను పక్కన పెట్టి నికోల్స్‌ను మరో ఓపెనర్‌గా పంపే అవకాశం ఉంది. కెప్టెన్ విలియమ్సన్, రాస్‌ టేలర్‌లపైనే కివీస్ అతిగా ఆధారపడుతోంది. గ్రాండ్‌హోమ్ లాంటి హిట్టర్ ఉండడం కివీస్‌కు అదనపు బలం. లాథమ్, నీషమ్‌ కూడా రాణించడం అవసరం. బౌలింగ్‌లో ప్రధాన బలం ట్రెంట్‌ బౌల్ట్‌. పేసర్లు మ్యాట్‌ హెన్రీ, లూకీ ఫెర్గూసన్‌, జిమ్మీ నీషమ్‌ మూడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను కట్టడి చేశారు. వీరితో భారత బ్యాట్స్‌మన్‌కు పరీక్షే.

వర్ష సూచన:

వర్ష సూచన:

ప్రస్తుతం అక్కడ గాలులతో వాతావరణం చల్లగా ఉండడం వల్ల పిచ్ పేస్ బౌలర్లకు సహకరించే అవకాశం ఎక్కువ. బౌండరీల దూరం తక్కువగా ఉండడంతో భారీ స్కోరు నమోదు కావొచ్చు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఇప్పటికే టోర్నీలో మూడు మ్యాచ్‌లు వర్షార్పణం కాగా.. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడే అవకాశం ఉంది.

ముఖాముఖి రికార్డులు:

ముఖాముఖి రికార్డులు:

ఇప్పటి వరకు భారత్, కివీస్ జట్లు మొత్తం 106 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో 55 భారత్‌ గెలవగా.. 45 న్యూజిలాండ్‌ గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. ఫలితం తేలనివి 5 మ్యాచ్‌లు. ప్రపంచకప్‌లో మొత్తం 7 మ్యాచులు ఆడగా.. భారత్‌ 3.. న్యూజిలాండ్‌ 4 గెలిచాయి.

జట్లు (అంచనా):

జట్లు (అంచనా):

భారత్‌: కేఎల్ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఎంఎస్ ధోనీ (వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌, కుల్దీప్‌ యాదవ్‌/ షమీ, చాహల్‌, బుమ్రా.

న్యూజిలాండ్‌ : కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్‌, మన్రో, నికొలస్‌, రాస్‌ టేలర్‌, లాథమ్‌ (వికెట్‌ కీపర్‌), నీషమ్‌, శాంట్నర్‌, గ్రాండ్‌ హోమ్‌, హెన్రీ, ఫెర్గూసన్‌, బౌల్ట్‌.

1
43661

{headtohead_cricket_3_4}

Story first published: Thursday, June 13, 2019, 11:54 [IST]
Other articles published on Jun 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X