న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో డీకాక్‌పై దయ చూపని బుమ్రా: సెహ్వాగ్ అదిరిపోయే ట్వీట్

ICC Cricket World Cup 2019 : Virender Sehwag’s Tweet On Jasprit Bumrah’s Wonderful Spell
CWC 2109: Virender Sehwag’s Quirky Descriptions Of Jasprit Bumrah’s Two Wickets

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రత్యర్ది జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే షాకిచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తన పదునైన బంతులతో సఫారీ బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసురుతున్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా అంచనాలకు మించి రాణిస్తుండటంతో టీమిండియా మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బుమ్రా అద్భుతంగా బంతులేస్తున్నాడని మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ట్విటర్‌లో ట్వీట్ చేశాడు.

23 రోజుల క్రితం ఐపీఎల్ మ్యాచ్‌లో క్వింటన్ డీకాక్‌పై దయ చూపించిన బుమ్రా నేటి మ్యాచ్‌లో మాత్రం దయ చూపలేదని సెహ్వాగ్ ఆ తర్వాతి ట్వీట్‌ పేర్కొన్నాడు. ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే తన ట్విట్టర్‌లో బుమ్రా సూపర్ స్పెల్‌తో చెలరేగిపోతున్నాడని ట్వీట్ చేశాడు. సఫారీలతో మ్యాచ్ బుమ్రాకి 50వ వన్డే మ్యాచ్ కావడం విశేషం.

దీంతో ఈ మ్యాచ్‌లో బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సైతం తన స్వింగ్‌లతో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతున్నాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతిని ఆడిన ఓపెనర్ హషీమ్ ఆమ్లా(6) రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

దీంతో జట్టు స్కోరు 11 పరుగుల వద్దే సఫారీలు తమ తొలి వికెట్‌ను కోల్పోయారు. తన కెరీర్‌లో తొలి ప్రపంచకప్ ఆడుతున్న బుమ్రాకు తన తొలి మ్యాచ్‌లోనే ఆరంభంలోనే వికెట్ దక్కడం విశేషం. ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్‌లోనే మరో ఓపెనర్ డికాక్(10) పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

1
43651

దీంతో ఓపెనర్లు ఇద్దరూ బుమ్రా బౌలింగ్‌లోనే ఔటయ్యారు. ఆ తర్వాత డుప్లెసిస్(38), డుస్సెన్(22) చాహాల్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఇక, జట్టు స్కోరు 89 పరుగుల వద్ద జేపీ డుమిని(3) కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 23 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్లర్(7), ఫెలుక్వాయో పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

Story first published: Wednesday, June 5, 2019, 17:04 [IST]
Other articles published on Jun 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X