వరల్డ్‌కప్: దక్షిణాఫ్రికాతో మ్యాచ్ బుమ్రాకి ఎంతో ప్రత్యేకం

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికా-టీమిండియా జట్లు తలపడుతున్నాయి. సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ వన్డేకి ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇది 50వ అంతర్జాతీయ వన్డే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో ఈ వన్డేని తనకు మరిచిపోలేనిదిగా మరల్చుకోవాలని క్రికెట్ అభిమానులు బుమ్రాకి సూచిస్తున్నారు. 25 ఏళ్ల బుమ్రా భారత్ తరుపున ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. బుమ్రా వన్డేల్లో ఇప్పటివరకు 85 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 5/27. ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లను ఒకసారి తీశాడు.
కాగా, తన కెరీర్‌లో 50వ వన్డే ఆడుతోన్న బుమ్రా చెలరేగుతున్నాడు. తన పదునైన బంతులతో సఫారీ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. దీంతో 24 పరుగులకే సఫారీలు 2 వికెట్లు కోల్పోయారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతిని ఆడిన ఓపెనర్ హషీమ్ ఆమ్లా(6) రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
దీంతో జట్టు స్కోరు 11 పరుగుల వద్దే సఫారీలు తమ తొలి వికెట్‌ను కోల్పోయారు. తన కెరీర్‌లో తొలి ప్రపంచకప్ ఆడుతున్న బుమ్రాకు తన తొలి మ్యాచ్‌లోనే ఆరంభంలోనే వికెట్ దక్కడం విశేషం. ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్‌లోనే మరో ఓపెనర్ డికాక్(10) పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఓపెనర్లు ఇద్దరూ బుమ్రా బౌలింగ్‌లోనే ఔటయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications