న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాల్లోకి ఎగిరి మరీ కమిన్స్ త్రో.. పూజారా రనౌట్ (వీడియో)

Cummins run-out tops Australias day

న్యూ ఢిల్లీ: అడిలైడ్ వేదికగా మొదలైన తొలి టెస్టులో పూజారా సెంచరీ కొట్టేశాడు. తన అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్లో 16వ సెంచరీని బాదేశాడు. వరుసగా టాపార్డర్ వికెట్లు పడిపోతున్న తరుణంలో తానొక్కడూ నిలబడి స్కోరును నడిపించాడు. విదేశీ గడ్డపై ఆడుతున్నామంటే గుర్తొచ్చే పేరు చెతేశ్వర్ పూజారా. మునపటి మ్యాచ్‌ల స్కోరు ఆధారంగా 5వేల పరుగులకు 95 పరుగుల దూరంలో తొలి టెస్టుకు బరిలోకి దిగాడు.

సహనంతో ఎదుర్కొని ఆసీస్‌కు విసుగుతెప్పించి

అలాంటి తరుణంలో క్రీజులోకి దిగి ఆసీస్ బౌలర్లను సహనంతో ఎదుర్కొని అంచనాలను అందుకున్నాడు.సెంచరీ దాటిన తర్వాత దూకుడు పెంచిన పూజారా... 246 బంతులు ఆడి 123 పరుగులు చేశాడు. ఆ తర్వాత పాట్ కమిన్స్ చేతులమీదుగా రనౌట్‌కు గురైయ్యాడు. అప్పటికే ఆస్ట్రేలియా జట్టుకు విసుగుతెప్పించిన పూజారాను అవుట్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. దీంతో కమిన్స్ చేసిన రనౌట్ ఫీట్ కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.

గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్‌తో ముగించిన టీమిండియా

పుజారా ప్రస్తుతం ఆడుతోన్న 108వ ఇన్నింగ్స్‌లో 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇదిలా ఉంటే, అడిలైడ్ టెస్టులో టీమిండియా గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో షమీ(6), బుమ్రా (0) ఉన్నారు.

వరుసగా వికెట్లు పడుతుంటే

జట్టు స్కోరు 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న టీమిండియా పుజారా ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో లంచ్‌కి ముందే నాలుగు వికెట్స్ తీసిన ఆసీస్ బౌలర్లు లంచ్ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ (37), రిష‌బ్ పంత్ (25) పెవిలియన్‌కు చేర్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్.. పుజారాతో కలిసి భారత్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు.

1
43623
Story first published: Thursday, December 6, 2018, 14:24 [IST]
Other articles published on Dec 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X