న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌కు తొలి స్వర్ణం అందించిన పూనియాపై ప్రశంసల వర్షం

By Nageshwara Rao
Cricketers wish Bajrang Punia after he bags gold in the Asian Games

హైదరాబాద్: ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన రెజ్లర్ భజరంగ్ పూనియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసియా గేమ్స్‌లో భాగంగా రెజ్లింగ్‌ 65 కేజీల పురుషుల విభాగంలో జపాన్‌కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పూనియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

పోటీ మొదలైన నిమిషంలోనే ప్రత్యర్థిని పట్టేసి భజరంగ్‌ 6-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే సమయంలో డైచి ఎదురుదాడికి దిగాడు. భజరంగ్‌ను తెలివిగా మ్యాట్‌ మీద పడేసి 4 పాయింట్లు గెలిచాడు. తొలి రౌండ్‌ ఆఖరికి భజరంగ్‌ 6-4తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత డైచి మరోసారి ప్రత్యర్థిని పట్టడంతో స్కోరు 6-6తో సమమైంది.

పోటీ ముగియడానికి సరిగ్గా 100 సెకన్లు ఉందనగా భజరంగ్‌ తన అనుభవాన్ని ఉపయోగించి అద్భుతమైన రీతిలో పుంజుకున్నాడు. ప్రత్యర్థిని దొరకబుచ్చుకున్న పూనియా 8-6తో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు మరోసారి డైచిని పట్టేసి 10-8తో ఆధిక్యంలో నిలిచాడు.

ఆ తర్వాత రక్షణాత్మకంగా ఆడిన భజరంగ్‌ సాంకేతికంగా మరో పాయింట్‌ గెలిచి 11-8తో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో యోగేశ్వర్‌దత్‌ (2014), కర్తార్‌సింగ్‌ (1978, 86), సత్పాల్‌సింగ్‌ (1982), రాజిందర్‌సింగ్‌ (1978), చంగ్డిసింగ్‌ (1970) తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడిగా భజరంగ్‌ నిలిచాడు.

అంతేకాకదు ఒకే ఏడాది కామన్వెల్త్‌, ఆసియా క్రీడల స్వర్ణాలు గెలిచిన భారత మూడో రెజ్లర్‌‌గా భజరంగ్ అరుదైన ఘనత సాధించాడు. దీంతో భజరంగ్ పూనియాపై సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో పలువురు క్రికెటర్లు కూడా ఉన్నారు.

Story first published: Monday, August 20, 2018, 16:36 [IST]
Other articles published on Aug 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X