న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హర్మన్‌ప్రీత్‌లా భారీ సిక్సర్లు, టీ20లు లేకుండా క్రికెటే లేదు: దాదా

By Nageshwara Rao
Cricket can't survive without T20: Sourav Ganguly

హైదరాబాద్: టీ20 క్రికెట్ లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు మనుగడలేదని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు చేస్తున్న ప్రదర్శనపై విలేకరులు అడిగిన గంగూలీ సమాధానాలు ఇచ్చాడు. సఫారీ గడ్డపై వన్డేల్లో కోహ్లీసేన అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడాడు.

Subscribe to Mykhel Telugu NewsletterSubscribe to Mykhel Telugu Newsletter

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా అద్బుతంగా ఆడి వన్డే సిరీస్‌ గెలిచిందని, చివరి టీ-20లో సైతం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోహ్లిసేనకు ఇదొక మంచి పర్యటన అని చెప్పారు. ఈ సందర్భంగానే 'క్రికెట్‌కు టీ20లు కచ్చితంగా కావాల్సిందే. టీ20లు లేకుండా క్రికెట్‌ మనుగడ సాగించలేదు' అని గంగూలీ చెప్పాడు.

అప్పటికీ ఇప్పటికీ ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ ఎలా ఉందన్న ప్రశ్నకు ఎప్పటిలాగే పారదర్శకంగా ఉందని చెప్పాడు. 'భారత ఎంపిక ప్రక్రియ అత్యుత్తమ విధానం' అని దాదా పేర్కొన్నాడు. కోచ్‌లను తొలగించడం, పదవీ కాలం తక్కువ చేయడం గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇకపై జరగబోదని గంగూలీ చెప్పాడు.

చాలా మంది యువ ఆటగాళ్లను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. 'మనీష్‌ పాండే, హర్ధిక్‌ పాండ్య భారత జట్టులో నిలకడగా ఆడుతున్నారు. సెహ్వాగ్‌, హర్భజన్‌లా జట్టులో కీలక ఆటగాళ్లుగా మారడానికి వారికి మరింత సమయం పడుతుంది. వీరూ, భజ్జీలకు చాలా కాలమే పట్టింది' అని అన్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోని అద్భుతమైన ప్లేయర్‌ అని కితాబిచ్చాడు. ధోని గురించి మాట్లాడుతూ 'ధోనీ వన్డేలు, టీ20ల్లో చక్కగా ఆడుతున్నాడు. మనం అతడిని తక్కువ చేయలేం. అతడు దేశానికి చేసిన సేవలను కచ్చితంగా గౌరవించాలి. అయితే మరొకరూ ఎదిగేందుకు అవకాశం ఇవ్వాలి' అని గంగూలీ అన్నాడు.

మహిళా క్రికెటర్లపై సైతం గంగూలీ ప్రశంసలు జల్లు కురిపించారు. 'క్రికెట్‌లో మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కన్నా భారీ సిక్సర్లు బాదగల వారిని మీరు చూపించగలరా? అయితే పురుషులు ఇంకా మెరుగ్గా ఉన్నారు' అని సౌరవ్ గంగూలీ అభిప్రాపడ్డాడు.

Story first published: Saturday, February 24, 2018, 10:22 [IST]
Other articles published on Feb 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X