న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కౌంటీ క్రికెట్‌లో 'క్వాలిటీ హ్యాట్రిక్' నమోదు: వీడియో వైరల్

By Nageshwara Rao
County Championship: Yorkshire take lead after Jordan Clark hat-trick for Lancashire

హైదరాబాద్: క్రికెట్‌లో 'క్వాలిటీ హ్యాట్రిక్' గురించి విన్నారా? వరుసగా మూడు వికెట్లు తీస్తే హ్యాట్రిక్‌ అంటాం. ఔటైన ఆ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ ప్రపంచంలోనే అత్యత్తుమ బ్యాట్స్‌మెన్‌ అయితే దానిని 'క్వాలిటీ హ్యాట్రిక్' అంటారు. సరిగ్గా ఇలాంటి ఘనతే ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో నమోదైంది. ఈ ఘనతను సాధించిన క్రికెటర్ పేరు జోర్డాన్‌ క్లార్క్‌.

కౌంటీ క్రికెట్‌లో భాగంగా యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్‌ బౌలర్‌ జోర్డాన్‌ క్లార్క్‌ వరుసగా జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌, జానీ బెయిర్‌ స్టోను పెవిలియన్‌ పంపించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న జో రూట్‌ ఇటీవలే భారత్‌తో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో రెండు సెంచరీలు సాధించాడు.

అంతేకాదు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్వవహారిస్తున్నాడు. ఇక, టెస్టుల్లో నాలుగో స్థానంలో ఉన్న కేన్‌ విలియమ్సన్‌ మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరిన ఇంగ్లాండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో సైతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాదు ఈ ముగ్గురూ టెస్టుల్లో మొత్తం 14,000 పైచిలుకు పరుగులు సాధించారు.

వన్డే సిరీస్‌ ముగియడంతో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్న ఓ మ్యాచ్‌లో లాంకాషైర్‌ బౌలర్‌ క్లార్క్‌ ఫామ్‌లో ఉన్న జో రూట్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత బంతికి కేన్ విలియమ్సన్‌ వికెట్ల ముందు నేరుగా ఆతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఇక, మూడో వికెట్‌గా బెయిర్‌స్టో స్లిప్‌లో జోస్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగడంతో క్లార్క్ 'క్వాలిటీ హ్యాట్రిక్' నమోదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఆగస్టు 1 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆరంభం కానుంది. తొలి టెస్టు బర్మింగ్ హామ్ వేదికగా జరగనుంది.

Story first published: Monday, July 23, 2018, 18:49 [IST]
Other articles published on Jul 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X