న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏ రాజకీయ నాయకుడు నాకు టచ్‌లో లేడు, దీదీకి థాంక్స్: నామినేషన్ తర్వాత గంగూలీ

Sourav Ganguly Wants To Bring Back 'Normalcy' To Indian Cricket || Oneindia Telugu
Conflict of Interest is an issue, it really needs to be looked at: Sourav Ganguly

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'పరస్పర విరుద్ధ ప్రయోజనాలు' అంశంపై వార్షిక సర్వసభ్య సమావేశంలో తప్పకుండా చర్చిస్తామని బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబోయే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.

ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం గంగూలీ మాట్లాడుతూ "క్రికెటర్లు వ్యవస్థలో ఒక భాగం. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం ఒక సమస్య, మనకు ఉత్తమ క్రికెటర్లు లభిస్తారో లేదో నేను చెప్పలేను. ఇది నిజంగా చర్చించాల్సిన అంశం" అని అన్నాడు.

<strong>No.1 ర్యాంకు: స్మిత్‌ను అధిగమించడానికి 2 పాయింట్ల దూరంలో కోహ్లీ!</strong>No.1 ర్యాంకు: స్మిత్‌ను అధిగమించడానికి 2 పాయింట్ల దూరంలో కోహ్లీ!

పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై దాదా

పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై దాదా

"ఎన్‌సీఏ, సీఏసీ, కోచ్‌ల ఎంపిక ఇలా ప్రతి ఒక్క దాంట్లో సమస్యలు ఉన్నాయి" అని గంగూలీ అన్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ సంస్థ అయిన బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టానికి తాను సిద్ధంగా ఉండటమే కాకుండా, సంతోషంగా కూడా ఉన్నానని ఈ సందర్భంగా గంగూలీ తెలిపాడు.

ఆర్డర్‌లో పెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది

ఆర్డర్‌లో పెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది

"ఈ హౌస్(బీసీసీఐ) ఒక ఆర్డర్‌లో పెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. ఏ రాజకీయ నాయకుడు నాతో టచ్‌లో లేడు. నేను మాత్రం మమతా దీదీ(పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి)కి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆమె మద్దతు నాకు లభించినందకు సంతోషంగా ఉంది. నేను ఎలాంటి డబ్బు తీసుకోలేదు" అని గంగూలీ తెలిపాడు.

ఈ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు

ఈ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు

"ఈ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు. కనీసం ఎవరితోనూ చెప్పలేదు. ఆదివారం రాత్రి 10:30 వరకు కూడా ఈ విషయం నాకు తెలియదు. అప్పుడే చెప్పారు నువ్వే బీసీసీఐ ప్రెసిడెంట్ కావాలని. దేశం కోసం ఆడాను, సార‌థిగా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టాను, గ‌త మూడేళ్ల నుంచి బీసీసీఐ ప‌నితీరు స‌రిగా లేద‌ు. ఇలాంటి సంద‌ర్భంలో బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం గొప్ప అవ‌కాశ‌మే" అని గంగూలీ అన్నాడు.

మళ్లీ భారత క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం

మళ్లీ భారత క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం

"బీసీసీఐలో పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. మరికొన్ని నెలల్లో అన్ని వ్యవస్థలు ప్రక్షాళన చేసి.. మళ్లీ భారత క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం. ఏక‌ప‌క్షంగా గెల‌వ‌డం ముఖ్యం కాదు అని, ప్ర‌పంచ క్రికెట్‌లోనే బీసీసీఐ అతిపెద్ద సంస్థ అని, దాని బాధ్య‌త‌లు చూసుకోవ‌డం ముఖ్య‌ం. ఆర్థిక‌ప‌రంగా బీసీసీఐ కీల‌క‌మైంది, అలాంటి సంస్థకు అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డం స‌వాలే" అని గంగూలీ పేర్కొన్నాడు.

Story first published: Monday, October 14, 2019, 20:38 [IST]
Other articles published on Oct 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X