న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భార్య కోసం.. బ్యాడ్మింటన్‌ కోచ్‌గా మారిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్‌ (వీడియో)!!

Cheteshwar Pujara Turns Badminton Coach For Wife Puja During Coronavirus Lockdown
Cheteshwar Pujara Turns Badminton Coach For Wife Puja During Lockdown

సౌరాష్ట్ర: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌లోనూ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని టీమిండియా క్రికెటర్లు అందిస్తున్నారు. మొన్నటివరకు మైదానంలో తమ ఆటతో ఉర్రూతలూగించిన క్రికెటర్లు.. ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా వెరైటీ ముచ్చట్లతో ఫ్యాన్స్‌ను రిలాక్స్‌ మూడ్‌లోకి తీసుకెళుతున్నారు. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రిత్‌ బుమ్రా, యజ్వేంద్ర చహల్‌, యువరాజ్ సింగ్, రిషబ్‌ పంత్‌లు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో పలు విషయాలు పంచుకుని ఫ్యాన్స్‌ అలరించారు. అయితే టీమిండియా స్పెషలిస్టు టెస్టు బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజార వీరందిరికి బిన్నంగా కోచ్‌ అవతారమెత్తాడు.

క్లార్క్ ఏడుగురు అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ జాబితా.. ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు!!క్లార్క్ ఏడుగురు అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ జాబితా.. ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు!!

భార్య కోసం కోచ్‌గా మారిన పుజార:

భార్య కోసం కోచ్‌గా మారిన పుజార:

లాక్‌డౌన్‌ సందర్భంగా చతేశ్వర్ పుజార ఇంట్లోని పనులతో బిజీబిజీగా గడుపుతున్నాడు. మరోవైపు ఖాళీ సమయమంతా కుటుంబంతో గడుపుతున్నాడు. ఈ క్రమంలో పుజార బ్యాడ్మింటన్ కోచ్ అవతారమెత్తాడు. తన భార్య పూజ కోసం పుజార కోచ్‌గా మారాడు. సోమవారం పుజార తన భార్య పూజకు కొన్ని బ్యాడ్మింటన్ పాఠాలు ఇస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. వీడియోలో ఇద్దరూ కలిసి తన ఇంట్లోని లాన్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు.

రిటర్మెంట్ తర్వాత కోచ్‌గా మారొచ్చు:

రిటర్మెంట్ తర్వాత కోచ్‌గా మారొచ్చు:

'పూజకు బ్యాడ్మింటన్ పాఠాలు ఇవ్వడం ద్వారా క్వారంటైన్‌ సమయంను బాగా ఉపయోగించుకుంటున్నా' అని వీడియోకు చతేశ్వర్ పుజార కాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోకు లక్ష్యకు పైగా లైకులు వచ్చాయి. ఫాన్స్ తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'రిటర్మెంట్ తర్వాత కోచ్‌గా మారొచ్చు' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'కరోనా సెలవులు బాగానే ఉపయోగపడుతున్నాయి' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

నా భార్యకు సాయం చేస్తున్నా:

నా భార్యకు సాయం చేస్తున్నా:

ఇటీవలే ఓ ఇంటర్వ్యూ ద్వారా చతేశ్వర్ పుజార తన లాక్​డౌన్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు. 'క్రికెట్ టోర్నీలు ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రాదు. లాక్​డౌన్ వల్ల సానుకూలత అంటే ఇదొక్కటే. ఈ సమయాన్ని వినియోగించుకోవాలని ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నా. కుటుంబ సబ్యులకు సాయం చేయండి. నేను కూడా నా భార్యకు సాయం చేస్తున్నా. నాకు వంట చేయడం రాదు. అందుకే.. ఇల్లు, పాత్రలు శుభ్రం చేస్తూ.. నా భార్యకు సాయం చేస్తున్నా. ఇంతకు ముందు మనం చేయని పనులను ఇప్పుడు చేయడం కూడా ముఖ్యం' అని పుజార తెలిపాడు.

పుజార సాయం:

కరోనా వైరస్ కట్టడికి తేశ్వర్ పుజార తనవంతు సాయాన్ని ప్రకటించాడు. పీఎం కేర్స్ ఫండ్‌తో పాటు గుజరాత్ సీఎం సహాయనిధికి విరాళం ఇచ్చినట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా అతడు తెలిపాడు. అయితే ఎంత మొత్తం విరాళం ఇచ్చాడనే విషయాన్ని మాత్రం పుజారా స్పష్టం చేయలేదు.

Story first published: Thursday, April 9, 2020, 11:11 [IST]
Other articles published on Apr 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X