న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమ్‌లో 11 మంది కోహ్లీలు లేరు కదా: ముత్తయ్య మురళీధరన్

Cannot Have 11 Virat Kohlis In The Team: Muttiah Muralitharan

హైదరాబాద్: మొహాలీ వేదికగా గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయిన కోహ్లీసేనపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ టీమిండియాకు మద్దతుగా నిలిచారు. జట్టులోని ఆటగాళ్లంతా కోహ్లీ మాదిరి ఆడాలనుకోవడం సాధ్యమయ్యే విషయం కాదని అన్నాడు.

<strong>పంత్‌లాగే ధోని కూడా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో క్యాచ్‌లు వదిలేశాడు</strong>పంత్‌లాగే ధోని కూడా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో క్యాచ్‌లు వదిలేశాడు

తుది జట్టులో ఉండే ఆటగాళ్లు అందరూ కోహ్లీలు కాలేరని, అది ఎప్పటికీ సాధ్యం కూడా కాదని తేల్చిచెప్పాడు. అంతేకాదు ఆటలో ఆటలో గెలుపోటములు సహజమని ముత్తయ్య వ్యాఖ్యానించాడు. కొన్ని సందర్భాల్లో గెలిస్తే, మరికొన్ని సార్లు ఓటమిని కూడా అంగీకరించాలని అన్నాడు.

భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది

భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది

ఈ సందర్భంగా మురళీధరన్ మాట్లాడుతూ "భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. వరల్డ్‌కప్‌ ముందు భారత్‌ జట్టు చేసే ప్రయోగాలు చాలా బాగున్నాయి. ఈ తరహా ప్రయోగాలు చేసేటప్పుడు గెలుపుతో పాటు ఓటమి కూడా ఉంటుంది. ఇక్కడ ఓపిక చాలా అవసరం. జట్టుతో పాటు అభిమానులకు కూడా సహనం కలిగి ఉండాలి" అని చెప్పాడు.

క్రికెటర్లకు ఒత్తిడి ఉండదు

క్రికెటర్లకు ఒత్తిడి ఉండదు

"అప్పుడే మీ క్రికెటర్లకు ఒత్తిడి ఉండదు. టీమ్‌లో 11 మంది విరాట్ కోహ్లీలు లేనందున.. విజయం సాధించే క్రమంలో కొన్ని ఓటములు ఎదురవుతాయి. ప్రతిఒక్కరూ మ్యాచ్ విన్నర్ కాలేరు. మనం కొన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తాం.. కొన్నింటిలో ఓడిపోతాం. లేకపోతే, ప్రతీ జట్టులో 11 మంది కోహ్లీలు లేక సచిన్ టెండూల్కర్లు లేక డాన్ బ్రాడ్‌మాన్‌లు ఉండాలి" అని ముత్తయ్య తెలిపాడు.

విమర్శలు చేసి ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకండి

విమర్శలు చేసి ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకండి

"కానీ అలా ఎప్పుడూ, ఏ జట్టులో జరగదు కదా. భారత ఆటగాళ్లు అమోఘంగా రాణిస్తున్నారు. దయచేసి అనవసర విమర్శలు చేసి ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకండి!" అని మురళీధరన్ అన్నాడు. ఇక, పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తప్పించడంపై కూడా ముత్తయ్య మురళీధరన్ స్పందించాడు.

కుల్దీప్, చాహల్ అద్భుతం

కుల్దీప్, చాహల్ అద్భుతం

అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కడం లేదంటే.. అది కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌ల సత్తాను నిరూపిస్తోందని ఈ సందర్భంగా తెలిపాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరిద్ద‌రూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారని అన్నాడు. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన విమర్శలు చేయాల్సిన అవసరం లేదని ముత్తయ్య చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, March 12, 2019, 15:04 [IST]
Other articles published on Mar 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X