న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో బుమ్రా భారత జట్టుకు పెద్ద అసెట్: సచిన్ టెండూల్కర్

Bumrah will be an asset for India in World Cup: Sachin Tendulkar

హైదరాబాద్: టీమిండియా ప్రీమియర్ స్ట్రైక్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జస్ప్రీత్ బుమ్రాపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన పేస్‌ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్లను ముప్పు తిప్పలు పెడుతున్న బుమ్రాయే, ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి జట్లకు అతిపెద్ద సవాల్ అని సచిన్ అన్నాడు. ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంల బుమ్రా కీలకంగా వ్యవహారించిన సంగతి తెలిసిందే.

బుమ్రా సక్సెస్‌ నాకేమీ ఆశ్చర్యం కలిగించ లేదు

బుమ్రా సక్సెస్‌ నాకేమీ ఆశ్చర్యం కలిగించ లేదు

తాజాగా స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సచిన్ మాట్లాడుతూ "నిజాయితీ చెప్పాలంటే, ఎప్పటికప్పుడు బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్న బుమ్రా సక్సెస్‌ నాకేమీ ఆశ్చర్యం కలిగించ లేదు" అని బుమ్రాపై సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రపంచంలోని టాప్ బ్యాట్స్‌మెన్‌కు సైతం బుమ్రా చుక్కలు చూపిస్తున్నాడని సచిన్‌ చెప్పుకొచ్చాడు.

బూమ్రాలో నిజాయితీ చూశా

బూమ్రాలో నిజాయితీ చూశా

ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌లో బుమ్రాతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవని సచిన్ హెచ్చరించాడు. "నేను అతనితో గడిపిన సమయాల్లో బూమ్రాలో ఒక నిజాయితీ చూశా. ప్రధానంగా బౌలింగ్‌లో పరిణితి సాధించడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లను సైతం బుమ్రా తన బౌలింగ్‌తో బోల్తా కొట్టించడం ప్రశంసనీయం" అని సచిన్ కొనియాడాడు.

బుమ్రా వైవిధ్యమైన బౌలర్‌

బుమ్రా వైవిధ్యమైన బౌలర్‌

"బుమ్రా వైవిధ్యమైన బౌలర్‌. నిలకడగా వికెట్లు సాధించడం అతని కచ్చితమైన బౌలింగ్‌కు నిదర్శనం. అదే అతన్ని ప్రమాదకరమైన బౌలర్‌గా నిలబెట్టింది. ఏ ప్రణాళికలతో మైదానంలోకి దిగుతాడో దాన్ని అమలు చేయడంలో బుమ్రా దిట్ట. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే భారత జట్టుకు బూమ్రా పెద్ద ఆస్తి. ప్రత్యర్థి జట్లకు బూమ్రా బౌలింగ్‌తో పెను ప్రమాదం పొంచి ఉంది" అని సచిన్‌ అన్నాడు.

పంత్‌కు అభిమానిని

పంత్‌కు అభిమానిని

సోమవారం ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై కూడా సచిన్ ప్రశంసలు కురిపించాడు. ఎటువంటి భయలేకుండా క్రికెట్‌ ఆడుతున్న పంత్‌కు తానొక అభిమానిగా సచిన్ పేర్కొన్నాడు. ఎంజాయ్‌ చేస్తూ క్రికెట్‌ ఆడే రిషభ్‌కు మంచి భవిష్యత్తు ఉందని సచిన్ అన్నాడు.

బుమ్రా స్థానంలో సిరాజ్‌

బుమ్రా స్థానంలో సిరాజ్‌

ఆసీస్ పర్యటనలో 21 వికెట్లు తీసి ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా గుర్తింపు పొందాడు. ఓ టెస్టు సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 2018లో 10 టెస్టులు ఆడి... 49 వికెట్లు తీసిన అతడు... ప్రీమియర్ టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ పర్యటన నుంచి బుమ్రాకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. బుమ్రా స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేశారు.

Story first published: Tuesday, February 5, 2019, 15:19 [IST]
Other articles published on Feb 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X