న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాన మధ్యమధ్యలో డిస్టర్బ్ చేయకుంటే ఇంగ్లాండ్ పనైపోయేది.. వణికించిన భారత పేసర్లు, 5వికెట్లు ఖతం

Bumrah, Shami, Siraj Attacking with Bowling Makes India in Upper Hand on Day 2

ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను రెండో రోజు వణికించారు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. బూమ్ బూమ్‌లా నిప్పులు చెరగడంతో పాటు సిరాజ్ మియా, షమీ భయ్యా చిక్కులు పెట్టడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 27ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 84పరుగులు చేసింది. క్రీజులో జానీ బెయిర్ స్టో (12పరుగులు 47బంతుల్లో), కెప్టెన్ బెన్ స్టోక్స్ (0, 4బంతుల్లో) ఉన్నారు. వర్షం మధ్యమధ్యలా పడుతూ ఇంగ్లాండ్‌ను కాపాడింది లేకపోతే.. ఇండియా బౌలర్ల నాటు బౌలింగ్‌కు దాదాపు ఇంగ్లాండ్ ఆలౌటయ్యేదే.

బుమ్రా దెబ్బకు 44కు 3వికెట్లు

బుమ్రా దెబ్బకు 44కు 3వికెట్లు

ఇక బుమ్రా దెబ్బకు మాస్టర్ క్లాస్‌ బౌలింగ్‌కు తొలుత అలెక్స్ లీస్ (6పరుగులు 9బంతుల్లో) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత జాక్ క్రాలీ (9పరుగులు 17బంతుల్లో 1ఫోర్) పని పట్టాడు. ఆ తర్వాత ఆలీ పోప్ (10పరుగులు 18బంతుల్లో) స్లిప్‌లో దొరకబుచ్చుకున్నాడు. ఇక క్రీజులో రూట్, బెయిర్ స్టో కాస్త కుదురుకుని ఆడుతున్నట్లు కన్పించింది. కానీ వీళ్లను కూడా బుమ్రా, సిరాజ్, షమీ తమ కట్టుదిట్టమైన బంతులతో కట్టడి చేశారు. 44పరుగులకే 3వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం వీరిద్దరు చేశారు.

వారిద్దరి భాగస్వామ్యానికి గండికొట్టిన సిరాజ్ మియా

వారిద్దరి భాగస్వామ్యానికి గండికొట్టిన సిరాజ్ మియా

వీరి 34పరుగుల భాగస్వామ్యానికి సిరాజ్ మియా గండికొట్టాడు. తన చక్కని షార్ట్ పిచ్ బంతితో రూట్ (31పరుగులు 67బంతుల్లో 4ఫోర్లు)ను కీపర్ క్యాచ్ ఔట్ చేశాడు. ఇక తర్వాత అనూహ్యంగా జాక్ లీచ్ బౌలింగ్ దిగగా.. షమీ బౌలింగ్లో తొలుత విరాట్ కోహ్లీ అతనిచ్చిన క్యాచ్ మిస్ చేశాడు. ఇక రెండో సారి కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో ఖాతా తెరవకుండానే అతను పెవిలియన్ చేరాడు. ఇక క్రీజులోకి బెన్ స్టోక్స్ వచ్చాడు. ఇక సమయం ముగిసేసరికి ఆటకు స్టంప్స్ పలికారు.

 రవీంద్రా జడేజా క్లాస్ సెంచరీ

రవీంద్రా జడేజా క్లాస్ సెంచరీ

ఇకపోతే రెండో రోజు 338/7 స్కోరుతో ఆట ప్రారంభించిన భారత జట్టు కాస్త దూకుడుగా ఆడింది. మహ్మద్ షమీ(16పరుగులు 31బంతుల్లో) వరుస బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డుకు ఊపొచ్చింది. కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఇక రవీంద్ర జడేజా 83పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగి క్రమశిక్షణగా ఆడుతూ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. బౌండరీతో సెంచరీకి చేరుకున్న జడ్డూ తన దైన స్టైల్లో బ్యాట్‌ను తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఒకే ఓవర్లో 35పరుగులు పిండుకున్న బుమ్రా

ఒకే ఓవర్లో 35పరుగులు పిండుకున్న బుమ్రా

సెంచరీ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఇక తర్వాత చివర్లో బుమ్రా ఒకే ఓవర్లో 35పరుగులు పిండుకోవడంతో భారత్ స్కోరు 416పరుగులకు చేరుకుంది. అంతకుముందు రిషబ్ పంత్ తొలి రోజు అత్యధ్భుతంగా ఆడి (111బంతుల్లో 146పరుగులు) ఇండియాను కష్టాల్లో నుంచి గట్టెక్కించిన సంగతి తెలిసిందే. ఇక అతను 6వికెట్‌కు జడేజాతో కలిసి 222పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 332పరుగుల వెనకబడి ఉంది.

తుది జట్లు

తుది జట్లు

భారత్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్(కీపర్), జాక్ లీచ్, మ్యాటీ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Story first published: Sunday, July 3, 2022, 7:20 [IST]
Other articles published on Jul 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X