న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాన్సెస్ 50-50 మాత్రమే: 'డెత్ ఓవర్లలో బౌలింగ్ ఎప్పడూ కష్టమే'

Bumrah says death bowling is always difficult

హైదరాబాద్: డెత్ ఓవర్లలో బౌలింగ్ ఎప్పుడూ కష్టంగా ఉంటుందని టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. విశాఖ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 19వ ఓవర్‌లో బుమ్రా రెండు పరుగులిచ్చి, రెండు వికెట్లు తీయడంతో టీమిండియా గెలుపు ఆశలను సజీవంగా ఉంచుకుంది.

India vs Australia: భారత్ తరుపున రెండో బౌలర్‌గా బుమ్రా అరుదైన రికార్డుIndia vs Australia: భారత్ తరుపున రెండో బౌలర్‌గా బుమ్రా అరుదైన రికార్డు

ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 14 పరుగులు

ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 14 పరుగులు

అయితే, ఆఖరి ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ ఆస్ట్రేలియా విజయానికి కావాల్సిన 14 పరుగులు సమర్పించుకోవడంతో భారత్ ఓటమిపాలైంది. దీంతో తొలి టీ20లో టీమిండియా ఓటమికి ఉమేశ్‌ యాదవే కారణమంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న తరుణంలో బుమ్రా అతడికి మద్దతుగా నిలిచాడు. డెత్ ఓవర్లలో గెలుపు అవకాశాలు 50-50గా ఉంటాయని చెప్పాడు.

మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ "డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చాలా కష్టం. గెలుపు అవకాశాలు 50-50గా ఉంటాయి" అని చెప్పాడు. "కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఫలితం వస్తే, మరికొన్ని ఫలితం ప్రతికూలంగా ఉండవచ్చు. విజయం అంచుల వరకూ వచ్చి మ్యాచ్‌ను చేజార్చుకోవడం బాధకరమే అయినా, ఎవరూ కావాలని పరుగులు ఇవ్వరు కదా?" అని అన్నాడు.

15-20 పరుగులు వెనుకబడిపోయాం

15-20 పరుగులు వెనుకబడిపోయాం

"ఈ వికెట్‌పై తాము బ్యాటింగ్‌లో ఇంకా 15-20 పరుగులు వెనుకబడిపోయాం. కనీసం 140 నుంచి 145 పరుగులు చేసి మంచి టార్గెట్‌ను ఆసీస్‌కు నిర్దేశించే వాళ్లమే. తాము అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నించినప్పటికీ కీలక సమయంలో వికెట్లు కోల‍్పోవడంతో స్కోరు మందగించింది. అదే తమ ఓటమిపై ప్రభావం చూపించింది" అని బుమ్రా పేర్కొన్నాడు.

టార్గెట్ తక్కువని తెలిస్తే పరిస్థితి వేరు

టార్గెట్ తక్కువని తెలిస్తే పరిస్థితి వేరు

"టార్గెట్ తక్కువని తెలిసినప్పుడు బ్యాటింగ్ ఆడే తీరు భిన్నంగా ఉంటుంది. నెమ్మదిగా ఆడుతూ బౌండరీలపైనే దృష్టి సారిస్తారు. అవసర రిస్క్‌లు తీసుకోరు. అయితే, తొలుత బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం మంచి స్కోరు చేయడం కోసం రిస్క్‌లు చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌తో కేఎల్‌ రాహుల్‌ తిరిగి ఫామ్‌లో రావడం సంతోషంగా ఉంది" అని బుమ్రా తెలిపాడు.

Story first published: Monday, February 25, 2019, 15:27 [IST]
Other articles published on Feb 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X