న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జెర్సీ నంబర్ 12కి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలి'

BCCI Should Retire No. 12 Jersey' Says Gautam Gambhir || Oneindia Telugu
BCCI should retire No. 12 jersey - tributes pour in for Yuvraj Singh

హైదరాబాద్: 19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడు ధరించిన జెర్సీ నంబర్ 12కి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలని మాజీ క్రికెటర్, ఎంఫీ గౌతమ్ గంభీర్ అన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సోమవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి తన 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు యువరాజ్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. యువీ రిటైర్మెంట్‌పై గౌతమ్ గంభీర్‌ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "నీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు ప్రిన్స్. భారత్‌కు వన్డే క్రికెట్‌లో నువ్వు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌వి. యువీ సేవలకుగానూ జెర్సీ నెంబర్ 12కి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలి.

నాకు నీ తరహాలో బ్యాటింగ్ చేయాలని ఉండేది చాంపియన్‌" అంటూ ట్వీట్ గంభీర్ చేశాడు.యువరాజ్ సింగ్ ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు(వరల్డ్ టీ20 2007, వన్డే వరల్డ్ కప్ 2011) అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, సహచరులకు, మిత్రులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పాడు.

క్రికెట్‌కు గుడ్‌బై: యువరాజ్ క్యాన్సర్‌ను ఎలా జయించాడో తెలుసా?క్రికెట్‌కు గుడ్‌బై: యువరాజ్ క్యాన్సర్‌ను ఎలా జయించాడో తెలుసా?

Story first published: Monday, June 10, 2019, 16:56 [IST]
Other articles published on Jun 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X