న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌ సలహా కమిటీలో మదన్‌లాల్‌, గంభీర్‌!!

BCCI Set To Appoint Madan Lal, Gautam Gambhir As CAC Members

న్యూఢిల్లీ: క్రికెట్‌ సలహా కమిటీ (సీఏపీ) సభ్యులుగా టీమిండియా వన్డే ప్రపంచకప్‌ విజేత జట్టు సభ్యులైన మదన్‌లాల్‌ (1983), గౌతమ్‌ గంభీర్‌ (2011)లను నియమితులు కానున్నారు. కమిటీ మూడో సభ్యురాలిగా ముంబైకి చెందిన మాజీ క్రీడాకారిణి సులక్షణా నాయక్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. సెలక్షన్‌ కమిటీల ఎంపిక కోసం బీసీసీఐ కొత్త సీఏసీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ త్రిసభ్య కమిటీ జాతీయ సెలెక్షన్‌ కమిటీని ఎంపిక చేయనుంది.

'సైనాను ఎప్పుడూ విస్మరించలేదు.. అకాడమీ నుంచి వెళ్లొద్దని చాలా బతిమిలాడా''సైనాను ఎప్పుడూ విస్మరించలేదు.. అకాడమీ నుంచి వెళ్లొద్దని చాలా బతిమిలాడా'

'సీఏపీ సభ్యులుగా మదన్‌లాల్‌, గంభీర్‌ల ఎంపిక ప్రకటన లాంఛనమే' అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఆదివారం వెల్లడించాడు. భారత్‌ నెగ్గిన తొలి వన్డే ప్రపంచకప్‌ జట్టులో సభ్యుడైన మదన్‌లాల్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ వర్గాల నుండి సమాచారం తెలిసింది. వచ్చే నాలుగేళ్ల పాటు పదవిలో ఉండే రెండు సెలక్షన్‌ కమిటీ (సీనియర్, జూనియర్‌)లను మదన్‌ లాల్‌ కమిటీ ఎంపిక చేయనుంది.

ప్రస్తుత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీలో చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ (సౌత్‌జోన్‌), గగన్‌ ఖొడా (సెంట్రల్‌)ల పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. మిగతా సభ్యులైన శరణ్‌దీప్‌ సింగ్‌ (నార్త్‌), దేవాంగ్‌ గాంధీ (ఈస్ట్‌), జతిన్‌ పరంజపే (వెస్ట్‌)లకు మరో ఏడాది కాలం గడువు ఉంది. మదన్‌లాల్‌, గంభీర్‌లు సెలక్షన్‌ కమిటీలో సభ్యులైతే.. వారితో శరణ్‌దీప్‌ బృందం పనిచేయనున్నారు.

ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్‌ కమిటి ఆదివారం రాత్రి జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ ప్రకటించింది. శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉన్న వైస్‌ కెప్టెన్‌ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ తిరిగి జట్టులో చేరాడు. సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ కూడా జట్టులోకి తిరిగొచ్చాడు. రోహిత్‌ రాకతో కేరళ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌పై వేటు పడింది. న్యూజిలాండ్‌ టూర్‌లో జరిగే మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం జట్టును ఆదివారమే ప్రకటించాల్సి ఉన్నా.. సెలెక్షన్‌ కమిటీ తాత్కాలికంగా వాయిదా వేసింది.

Story first published: Monday, January 13, 2020, 10:28 [IST]
Other articles published on Jan 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X