న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి విశ్రాంతి!: బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు అక్టోబర్ 24న టీమిండియా ఎంపిక

India vs Bangladesh 2019 : Virat Kohli Likely To Be Rested For T20I Series Against Bangladesh
BCCIs selection committee to meet on October 24 to select India squad for Bangladesh series

హైదరాబాద్: రాబోయే బంగ్లాదేశ్ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి అక్టోబర్ 24న బీసీసీఐ సెలక్టర్లు సమావేశం కానున్నారు. మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. తొలుత టీ20 సిరిస్ జరగనుండగా... ఆ తర్వాత టెస్టు సిరిస్ జరగనుంది.

బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరిస్ నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, గురువారం నాటి సమావేశంలో కోహ్లీ విశ్రాంతిపై సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుంది. అక్టోబర్ 23న సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తాడు.

హార్ధిక్ పాండ్యా పెళ్లికి గ్రీన్ సిగ్నల్: కాబోయే భార్య ఎవరో తెలుసా?హార్ధిక్ పాండ్యా పెళ్లికి గ్రీన్ సిగ్నల్: కాబోయే భార్య ఎవరో తెలుసా?

ఆ తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశం కానుండటంతో ఈ మీటింగ్ కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంపై సౌరవ్ గంగూలీ కూడా స్పందించాడు. గంగూలీ మాట్లాడుతూ "అక్టోబర్‌ 24న కోహ్లీతో చర్చిస్తా. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో కెప్టెన్‌తో మాట్లాడతా. బంగ్లా సిరీస్‌ ఆడతాడా లేదా విశ్రాంతి తీసుకుంటాడా? అనేది అతడి ఇష్టం" అని అన్నాడు.

భారత్-బంగ్లా పర్యటనపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ క్రికెటర్లు 11 పాయింట్లతో కూడిన డిమాండ్లను ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుంచారు. అయితే, సౌరవ్ గంగూలీ మాత్రం బంగ్లా ఆటగాళ్లు భారత సిరీస్‌కు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా ఈడెన్‌ గార్డెన్‌లో గంట మోగించి రెండో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభిస్తారని తెలిపాడు.

ధోనీ మా గెస్ట్.. డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాడు.. హలో చెప్పండి!!(వీడియో)ధోనీ మా గెస్ట్.. డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాడు.. హలో చెప్పండి!!(వీడియో)

నవంబరు 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా 10న జరగనున్నాయి. అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకి ప్రారంభం కానున్నాయి. నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు.. నవంబర్ 22 నుంచి కోల్‌కతా వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.

భారత పర్యటనకు బంగ్లా టీ20 జట్టు:
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, మహ్మద్ నయిం, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అమినుల్ ఇస్లామ్, అర్ఫాట్ సన్నీ, మహ్మద్ సైఫుద్దీన్, అల్ అమిన్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్లా ఇస్లామ్, అపిఫ్ హుస్సేన్, మసదేక్ హుస్సేన్.

Story first published: Tuesday, October 22, 2019, 17:44 [IST]
Other articles published on Oct 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X