న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2023 : ఆసియా కప్ వేదిక మార్పుపై మీటింగ్.. గ్యారంటీ అంటున్న బీసీసీఐ!

BCCI confident on changing Asia Cup 2023 host nation

ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ టోర్నీమెంట్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఈ టోర్నమెంట్‌ కోసం భారత జట్టును ఆ దేశానికి పంపడం కుదరదని బీసీసీఐ తేల్చిచెప్పేసింది. దీంతో అప్పటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా కూడా బెదిరింపులకు దిగాడు. ఒకవేళ భారత్ కనుక తమ దేశానికి రాకుంటే.. తాము కూడా వన్డే వరల్డ్ కప్ ఆడబోమని హెచ్చరించాడు.

 ఆసియా కప్ షెడ్యూల్..

ఆసియా కప్ షెడ్యూల్..

అనంతరం ఆసియా కప్ రోడ్ మ్యాప్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ప్రకటించాడు. దీనిలో ఈ టోర్నీ ఎక్కడ జరుగుతుందో ఆ వేదిక పేరును వెల్లడించలేదు. అప్పటికి పీసీబీ చైర్మన్ పదవి నుంచి రమీజ్ రజాను తొలగించేశారు. దీంతో కొత్త చైర్మన్ నజామ్ సేథీ ఇలా ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఏసీసీ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని చాలా గొప్ప పని చేసిందని, కావాలంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ కూడా ప్రకటించాలని ఎద్దేవా చేశాడు.

 జై షాతో మీటింగ్..

జై షాతో మీటింగ్..

ఈ విమర్శలపై వెంటనే స్పందించిన ఏసీసీ.. తాము ఈ షెడ్యూల్ గురించి పీసీబీకి పలు ఈమెయిల్స్ పంపినట్లు వెల్లడించింది. కానీ ఆ క్రికెట్ బోర్డు నుంచి తమకు ఎలాంటి సమాధానం రాలేదని, అందుకే తాము ఈ షెడ్యూల్ ఖరారు చేశామని ఏసీసీ ప్రతినిధులు తేల్చిచెప్పారు. దీంతో కొంత వెనక్కు తగ్గిన నజాం సేథీ.. ఏసీసీ చైర్మన్ జై షాతో సమావేశం అవడానికి అపాయింట్‌మెంట్ కోరాడు.

అత్యంసర మీటింగ్..

అత్యంసర మీటింగ్..

అయితే అతనికి ఏసీసీ ప్రతినిధులను కలిసే అవకాశం దక్కింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ టీ20 లీగ్ సందర్భంగా ఏసీసీ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసేందుకు పీసీబీ చీఫ్ నజాం సేథీ అందర్నీ ఒప్పించారు. దీంతో బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ చైర్మన్ జై షా కూడా బహ్రెయిన్ చేరుకున్నారు. భారత జట్టును పాకిస్తాన్ పంపడం మాత్రం కుదరదంటే కుదరదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

 వేదిక మార్పు గ్యారంటీ..

వేదిక మార్పు గ్యారంటీ..

అదే సమయంలో తాజాగా పెషావర్‌లో జరిగిన పేలుడు పాకిస్తాన్ స్టాండ్‌ను కొంత బలహీనం చేసింది. దీంతో హోస్టింగ్ హక్కులను పాకిస్తాన్ వద్దనే ఉంచి, వేదికను మాత్రం శ్రీలంక లేదా యూఏఈకి మార్చాలని ఏసీసీ అధికారులు భావిస్తున్నారట. ఏం జరిగినా సరే పాకిస్తాన్ నుంచి ఆసియా కప్ వేదిక మారడం మాత్రం గ్యారంటీ అని బీసీసీఐ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మాత్రం వేచి చూడక తప్పదు.

Story first published: Saturday, February 4, 2023, 16:40 [IST]
Other articles published on Feb 4, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X