For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ కొంపముంచింది అతడే... జట్టులో లెజెండ్స్ ఉన్నా ఓడిస్తాడు!

టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి పాకిస్థాన్ జట్టు నిష్క్రమించిన తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాక్ మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ రషీద్ లతీఫ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పాక్ క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. పాకిస్థాన్ జట్టు ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు క్రీడపై అవగాహన లేకపోవడమేనని రషీద్ లతీఫ్ మండిపడ్డారు. 'హర్నా మనా హై' అనే టీవీ షోలో మాట్లాడుతూ ఆయన ఓ సంచలన కామెంట్ చేశారు. "ఒకవేళ ఈ కెప్టెన్‌కు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ బౌలర్లను ఇచ్చినా సరే, అతను మ్యాచ్‌ను ఓడించేస్తాడు" అని ఎద్దేవా చేశారు. జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పటికీ.. వారిని సరైన సమయంలో ఉపయోగించుకోలేకపోవడమే పాక్ కొంపముంచిందని ఆయన అభిప్రాయపడ్డారు.

బౌలింగ్ వ్యూహాల్లో ఘోర వైఫల్యం
శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ 212 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ.. సెమీస్‌కు వెళ్లాలంటే లంకను 147 పరుగుల లోపే కట్టడి చేయాల్సిన సమీకరణం ఉంది. అయితే బౌలింగ్ మార్పుల్లో కెప్టెన్ చేసిన తప్పిదాల వల్ల లంక ఏకంగా 207 పరుగులు చేసింది. డెత్ ఓవర్ల కోసం కీలక బౌలర్ నసీమ్ షా ఓవర్లను దాచి ఉంచకపోవడం, వికెట్లు తీయగల అబ్రార్ అహ్మద్‌ను ఆలస్యంగా బౌలింగ్‌కు తీసుకురావడం వంటి నిర్ణయాలు జట్టును దెబ్బతీశాయని లతీఫ్ వేలెత్తి చూపారు. ముఖ్యంగా షాదాబ్ ఖాన్‌ను 15వ ఓవర్లో బౌలింగ్‌కు పిలవడం కెప్టెన్ అజ్ఞానానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.

Rashid Latif Blasts Salman Ali Agha After Pak T20 World Cup 2026 Exit Says He Should Lose Even With Legends

బ్యాటింగ్ ఆర్డర్‌లో అయోమయం
జట్టు వైఫల్యానికి కేవలం కెప్టెన్ మాత్రమే కాకుండా.. హెడ్ కోచ్ మైక్ హెసన్, సపోర్ట్ స్టాఫ్ కూడా సమాన బాధ్యత వహించాలని రషీద్ లతీఫ్ డిమాండ్ చేశారు. బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇష్టానుసారంగా మారుస్తూ ఆటగాళ్లలో స్థిరత్వం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "నఫాయ్, షాదాబ్ వంటి వారిని ఏ స్థానంలో పంపాలో తెలియని అయోమయంలో మేనేజ్‌మెంట్ ఉంది. ఈ అనవసర ప్రయోగాల వల్లే పాకిస్థాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది" అని లతీఫ్ విశ్లేషించారు.

పీసీబీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం
శ్రీలంకపై నెగ్గినప్పటికీ.. నెట్ రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్‌ను అధిగమించలేక పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ పరాజయం నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు (PCB) నాయకత్వ బాధ్యతలు, కోచింగ్ సిబ్బందిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు. జట్టును గాడిలో పెట్టాలంటే సమూల మార్పులు అవసరమని రషీద్ లతీఫ్ తన విశ్లేషణను ముగించారు.

Story first published: Tuesday, March 3, 2026, 16:44 [IST]
Other articles published on Mar 3, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+