న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్ పర్యటనకు షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ

BCCI announces fixtures for Windies’ tour of India

న్యూ ఢిల్లీ: కొద్ది కాలంగా విదేశీ పర్యటనల్లో మునిగిపోయిన టీమిండియా.. అక్టోబరు, నవంబరు నెలల్లో సొంతగడ్డపై ఆడబోతుంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య భారత్‌తో ఇప్పటికే విండీస్ జట్టు షెడ్యూల్ ప్రకటించేయగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వేదికలతో సహా జట్టు పూర్తి వివరాలను ప్రకటించింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి మొదలుకానున్న సిరీస్ అక్టోబర్ 16వరకూ ఈ సిరస్ జరగనుంది. ఇందులో రాజ్ కోట్.. హైదరాబాద్‌లు కూడా వేదిక కానున్నాయి.

షెడ్యూల్ ప్లాన్ చేసుకుందిలా:

షెడ్యూల్ ప్లాన్ చేసుకుందిలా:

ఆ తర్వాత మరో నాలుగు రోజుల విరామం తీసుకుని మళ్లీ వవ్డే సిరీస్ ఆడనున్న టీమిండియా అక్టోబర్ 21 నుంచి నవంబరు 1వరకూ పోరాడేందుకు సన్నద్ధమైంది. గౌహతి, ఇండోర్, పూనె, ముంబై, తిరువనంతపురంలు 50 ఓవర్లు ఫార్మాట్‌కు వేదిక కానున్నాయి. ఈ మ్యాచ్‌ల మధ్యలో కనీసం రెండు రోజుల విరామం ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు.

మొదటి మ్యాచ్‌ను ఈడెన్ గార్డెన్స్ వేదికగా

మొదటి మ్యాచ్‌ను ఈడెన్ గార్డెన్స్ వేదికగా

ఇక టీ 20విషయానికొచ్చేసరికి మొదటి మ్యాచ్‌ను కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిర్వహించనున్నారు. ఇదే వేదికగా విండీస్ జట్టు ఇంగ్లాండ్ జట్టును ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. లక్నో.. చెన్నైలు కూడా ఆ ట్రోఫీకి వేదికలయ్యాయి. ప్రస్తుతం విండీస్ క్రికెటర్లు కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్నారు.

ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-3 తేడాతో

ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-3 తేడాతో

టీమిండియా మాత్రం ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-3 తేడాతో చేజార్చుకుంది. ఈ పర్యటన అనంతరం టీమిండియా ఆసియా కప్‌లో వన్డే మ్యాచ్‌లలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబరు 15 నుంచి ఆడనుంది. విండీస్ జట్టు ఇటీవల కాలంలో భారత్ కంటే బలమైన జట్టును ఎదుర్కొన్నది లేదు. కరేబియన్ లీగ్ కంటే ముందు ఆడిన సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో ఆడి టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. కానీ, వన్డే, టీ 20 సిరీస్‌లను కోల్పోయింది.

మూడు ఫార్మాట్ల పూర్తి వివరాలు.. :

మూడు ఫార్మాట్ల పూర్తి వివరాలు.. :

టెస్టు సిరీస్‌:

రాజ్‌కోట్‌లో మొదటి టెస్టు 4-8 అక్టోబరు వరకూ

హైదరాబాద్‌లో రెండో టెస్టు 12-16 అకోబరు వరకూ

వన్డే సిరీస్‌:

తొలి వన్డే: అక్టోబర్‌ 21, గుహవాటి

రెండో వన్డే: అక్టోబర్ 24 ‌, ఇండోర్‌

మూడో వన్డే: అక్టోబర్‌ 27,పుణె

నాల్గో వన్డే: అక్టోబర్‌ 29, ముంబై

ఐదో వన్డే: నవంబర్‌1, తిరువనంతపురం

టీ20 సిరీస్‌:

తొలి టీ20: నవంబర్‌ 4, కోల్‌కతా

రెండో టీ20: నవంబర్‌ 6, లక‍్నో

మూడో టీ20: నవంబర్‌ 11, చెన్నై

Story first published: Tuesday, September 4, 2018, 17:32 [IST]
Other articles published on Sep 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X