న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫైన‌ల్ వాకిట్లో బోల్తా: టీమిండియా మ‌రో ద‌క్షిణాఫ్రికాలా మార‌బోతోందా?

 Back-to-back World Cup semi-final losses after a terrific league run; Are India the new South Africa?

మాంచెస్ట‌ర్‌: ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఆరంభంలో వ‌రుస విజ‌యాల‌తో అద‌ర గొట్ట‌డం, చివ‌రికి వ‌చ్చే స‌రికి బొక్క బోర్లా ప‌డే క్రికెట్ జ‌ట్టు ఏదైనా ఉందా అంటే- ద‌క్షిణాఫ్రికా అని ఎవ‌ర్న‌డినా ఇట్టే చెప్పేస్తారు. వ‌రుస విజ‌యాల‌తో ఎక్క‌డికో దూసుకెళ్ల‌డం, తీరా కీల‌క మ్యాచ్‌కు వ‌చ్చేట‌ప్ప‌టికీ, అక్క‌డి నుంచి కింద‌ప‌డ‌టం..ప్రొటీస్ టీమ్‌కు బాగా అల‌వాటు. అలాంటి ఆట‌తీరుకు పేటెంట్ ఉన్న ఏకైక జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు త‌మ‌ స్థాయికి త‌గ్గ క్రికెట్‌ను ఆడ‌లేద‌నుకోండి.. అది వేరే విష‌యం. ప్ర‌పంచక‌ప్ చ‌రిత్ర‌ను ఒక్క‌సారి తిర‌గేస్తే- లీగ్ ద‌శ‌లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చింది దక్షిణాఫ్రికా జ‌ట్టు. నాకౌట్ లేదా సెమీ ఫైనల్‌కు వ‌చ్చే స‌రికి గుడ్లు తేలేస్తోంది. టీమిండియా కూడా ప్ర‌స్తుతం అదే అల‌వాటును పుణికి పుచ్చుకొన్న‌ట్లు క‌నిపిస్తోంది.

బ‌్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ధోనీ వెన‌క్కి: ప్ర‌యోగం చేసి చేతులు కాల్చుకున్న కోహ్లీ!బ‌్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ధోనీ వెన‌క్కి: ప్ర‌యోగం చేసి చేతులు కాల్చుకున్న కోహ్లీ!

లీగ్ ద‌శ‌ల్లో ఓట‌మి అనేదే లేకుండా..

లీగ్ ద‌శ‌ల్లో ఓట‌మి అనేదే లేకుండా..

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ద‌క్షిణాఫ్రికా ప్ర‌స్థానం ఓ పెను సంచ‌ల‌నంగా చెప్పుకోవచ్చు. 1996లో తొలిసారిగా ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో అడుగు పెట్టింది ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు. ఆరంభంలోనే ప్ర‌కంప‌నల‌ను పుట్టించింది. హాట్ ఫేవ‌రెట్‌గా నిలిచింది. ప‌సికూలలా త‌న కేరీర్‌ను ఆరంభించిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు.. టోర్నీ ముగిసే స‌మ‌యానికి శ‌క్తిమంతంగా ఎదిగింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లోనే తిరుగుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ.. వ‌ర్షం వ‌ల్ల మాత్రమే ఆ జ‌ట్టు ఓడిపోయింద‌నేది నిఖార్స‌యిన నిజం. అలా ఆరంభ‌మైన ఆ జ‌ట్టు ప్ర‌స్థానం ఎప్పుడూ ఫైన‌ల్ రుచి చూడ‌లేదంటే ఆశ్చ‌ర్య‌మేస్తోంది. శాపాలు వెంటాడుతున్నాయేమోన‌నే అనుమానం క‌లుగుతుంది.

 సెమీ ఫైన‌ల్‌లో ఓడిపోయే అల‌వాటు ఇప్ప‌టిది కాదు..

సెమీ ఫైన‌ల్‌లో ఓడిపోయే అల‌వాటు ఇప్ప‌టిది కాదు..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వ‌హించిన 2015 నాటి ప్ర‌పంచ‌కప్ టోర్న‌మెంట్‌లోనూ ద‌క్షిణాఫ్రికన్లు సెమీస్‌లోనే వెనుదిరిగిన విష‌యం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఆ మ్యాచ్‌లో బ్లాక్ క్యాప్స్ ద‌క్షిణాఫ్రికా టీమ్‌ను మట్టి క‌రిపించారు. మ్యాచ్ ముగిసిన వెంట‌నే ఏబీ డివిలియ‌ర్స్‌, డేల్ స్టెయిన్ వంటి హేమాహేమీలు గ్రౌండ్‌లోనే కూల‌బ‌డ్డారు. క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. సెమీస్ ద‌శ‌లో ఓడిపోవ‌డం ద‌క్షిణాఫ్రిక‌న్ల‌కు కొత్తేమీ కాదు. 2011 ప్ర‌పంచ‌క‌ప్‌లో లీగ్ ద‌శ‌లో రాణించినా, నాకౌట్ మ్యాచ్‌లో తేలిపోయింది. 1999 ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్‌లో ద‌క్షిణాఫ్రికా చివ‌రి ఓవ‌ర్‌లో ఓట‌మిని కొనితెచ్చ‌కున్న విష‌యాన్ని క్రికెట్ ప్రియులెవ‌రూ మ‌రిచిపోలేరు. ద‌క్షిణాఫ్రిక‌న్ల‌కు అదో పీడ‌క‌ల‌. ప్ర‌స్తుతం టీమిండియా కూడా అదే వార‌స‌త్వాన్ని కొని తెచ్చుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. 1

నాలుగు సెమీ ఫైన‌ల్ మ్యాచుల్లో ప‌రాజ‌యం..

నాలుగు సెమీ ఫైన‌ల్ మ్యాచుల్లో ప‌రాజ‌యం..

గంగ కాస్తా చంద్ర‌ముఖిలా త‌యారైన‌ట్లు టీమిండియా కాస్తా క్ర‌మంగా ద‌క్షిణాఫ్రిక‌లా మారిపోతోంది. నాలుగు ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ల‌లో సెమీ ఫైన‌ల్‌లో ప్ర‌వేశించిన టీమిండియా.. ఒక్క అడ్డంకిని అధిగ‌మించ‌లేక‌పోయింది. 2011 ప్ర‌పంచ‌క‌ప్‌ను ఇందులో మిన‌హాయించ‌వ‌చ్చు. 1987 సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది భార‌త్‌. 1996లో సెమీఫైన‌ల్‌లో ఓట‌మి చ‌వి చూసింది. 1999లో సెమీస్ కూడా చేర‌లేకపోయింది. 2003లో ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. 2007లోనూ గ్రూప్ ద‌శ‌లోనే నిష్క్ర‌మించింది. 2011లో టైటిల్ విజేత‌గా నిలిచిన‌ప్ప‌టికీ.. ఆ త‌రువాత జ‌రిగిన రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లల్లో సెమీస్ గండం నుంచి గ‌ట్టెక్క‌లేక చ‌తికిల ప‌డింది.

Story first published: Thursday, July 11, 2019, 14:03 [IST]
Other articles published on Jul 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X