న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచంలోనే చెత్త కీపర్‌.. కెప్టెన్‌ కాబట్టే జట్టులో ఉన్నాడు!!

Australia vs New Zealand, 1st Test: Tim Paine Miss Easy Run-Out of BJ Watling, Fans Troll him

పెర్త్‌: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య పెర్త్‌ వేదికగా తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ డే/నైట్‌ టెస్టులో ఓ చిన్న తప్పిదం చేసిన ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్, వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌పై ఆ దేశ అభిమానులు మండిపడుతున్నారు. వరుస కామెంట్స్‌ చేస్తూ పైన్‌కు నిద్రపట్టకుండా చేస్తున్నారు. విషయంలోకి వెళితే.

<strong>ఆదుకున్న అయ్యర్‌.. పంత్‌ తొలి హఫ్‌సెంచరీ.. స్కోర్ 200/4</strong>ఆదుకున్న అయ్యర్‌.. పంత్‌ తొలి హఫ్‌సెంచరీ.. స్కోర్ 200/4

 రెండో పరుగు కోసం ప్రయత్నం

రెండో పరుగు కోసం ప్రయత్నం

పెర్త్‌ టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా టిమ్‌ పైన్‌ తన చెత్త కీపంగ్‌తో కివీస్‌ బ్యాట్స్‌మన్‌ వాట్లింగ్‌ను రనౌట్‌ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌ లో భాగంగా పేసర్ మిచెల్‌ స్టార్‌ వేసిన 35వ ఓవర్‌ ఐదో బంతిని రాస్‌ టేలర్‌ కవర్‌ పాయింట్‌ దిశగా షాట్ ఆడాడు. టేలర్‌ సింగిల్‌ తీశాడు. టేలర్‌ వద్దని చెపుతున్నా.. నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న వాట్లింగ్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించి సగం క్రీజు వరుకు వెళ్ళిపోయాడు.

కీపింగ్‌లో విఫలం:

కీపింగ్‌లో విఫలం:

ఫీల్డింగ్‌ చేస్తున్న స్పిన్నర్ నాథన్‌ లియోన్‌ బంతిని అందుకొని వికెట్‌ కీపర్‌ పైన్‌కు విసిరాడు. సులువైన బంతిని అందుకోవడంలో పైన్‌ విఫలమయ్యాడు. దీంతో వాట్లింగ్‌ రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆటగాళ్లు అందరూ ఆశ్చర్యంగా అతనివంక చూడగా.. సిగ్గుతో తలదించుకున్నాడు. అయితే ఈ రనౌట్‌ మిస్సయినప్పటికీ.. వాట్లింగ్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 పరుగులకే ప్యాట్‌​ కమిన్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ప్రపంచంలోనే చెత్త కీపర్‌:

ప్రపంచంలోనే చెత్త కీపర్‌:

అయితే పైన్‌ రనౌట్‌కు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఇది చూసిన ఆసీస్ అభిమానులు అతన్ని ఓ ఆటాడుకుంటున్నారు. 'ప్రపంచంలోనే చెత్త కీపర్‌' అని ఓ నెటిజన్‌ ఆగ్రహం వ్య​క్తం చేయగా.. 'పైన్‌ జట్టులో ఎందుకున్నాడో నాకర్థం కావడం లేదు' అని మరో నెటిజన్‌ మండిపడ్డాడు. 'కెప్టెన్‌ కాబట్టే జట్టులో ఉన్నాడు', కీపింగ్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. ఇక బ్యాటింగ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది', 'అలెక్స్‌ క్యారీకి అవకాశం ఇవ్వాలి', 'స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి పైన్‌ను జట్టు నుంచి పంపేయాలి' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కివీస్‌ ఓటమి:

ఈ మ్యాచ్‌లో కివీస్‌ ఓడిపోయింది. నాథన్‌ లియోన్‌, మిచెల్‌ స్టార్‌ చెరో నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 296 పరుగులతో విజయం సాధించింది. స్టార్‌, లియోన్‌ ధాటికి కివీస్‌ 65.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్‌ సెంచరీ చేసాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించకుండా ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్‌ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Story first published: Sunday, December 15, 2019, 17:46 [IST]
Other articles published on Dec 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X