న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేన న్యూ లుక్: న్యూ జెర్సీ ఫస్ట్‌లుక్: పాత తరాన్ని గుర్తుకు తెచ్చేలా: ఆ కంపెనీ స్పాన్సర్

AUS vs IND: Team India To Wear New ‘Retro’ Themed Jersey
IND vs Aus 2020 : Team India To Wear New Jersey Inspired By The Seventies | Oneindia Telugu

ముంబై: భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ఈ నెలాఖరులో ప్రారంభం కాబోతోంది. రెండు నెలలకు పైగా కొనసాగబోతోన్న సుదీర్ఘమైన టూర్ ఇది. ఆసీస్ టీమ్‌ను వారి సొంతగడ్డపై ఢీ కొట్టబోతోంది. దీనికోసం శుక్రవారం నుంచే టీమిండియా నెట్ ప్రాక్టీస్ ప్రారంభించబోతోంది. బలమైన ఆస్ట్రేలియా జట్టును ఆస్ట్రేలియా గడ్డ మీదే ఓడించడం బిగ్ ఛాలెంజ్. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఆసీస్ జట్టును ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది. టీ20, వన్డే ఇంటర్నేషనల్స్‌‌లో ఆడినప్పటికీ.. టెస్ట్ సిరీస్‌కు కోహ్లీ దూరం కావడం దాదాపు ఖాయమైనట్టే.

న్యూ జెర్సీ.. ఫస్ట్‌లుక్

న్యూ జెర్సీ.. ఫస్ట్‌లుక్

ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా టీమిండియా న్యూ లుక్‌తో మెరిసిపోనుంది. కొత్త జెర్సీని ధరించబోతోంది. ఈ జెర్సీ ఫస్ట్‌లుక్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ) ఆవిష్కరించింది. పాత తరం క్రికెటర్లను గుర్తుకు తీసుకొచ్చేలా ఈ జెర్సీని డిజైన్ చేశారు. ముదురు నీలం రంగు జెర్సీ ఇది. భుజాల వద్ద తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు వరుసలు ఉంటాయి. ఇదివరకు భారత క్రికెట్ జట్టు ధరించిన జెర్సీని పోలీ ఉంటుంది. దీని మీద ఎంపీఎల్ స్పోర్ట్స్‌ పేరును ముద్రిస్తారు.

ఎంపీఎల్ స్పాన్సర్‌షిప్

ఎంపీఎల్ స్పాన్సర్‌షిప్

టీమిండియా ప్లేయర్లకు ఈ కొత్త కిట్లను స్పాన్సర్ చేస్తోంది ఆ సంస్థే. ఎంపీఎల్ స్పోర్ట్స్ సంస్థ యాజమాన్యంతో కిందటి నెలలోనే బీసీసీఐ ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 120 కోట్ల రూపాయలతో పాటు వచ్చే ఆదాయాన్ని పంచుకునేలా బీసీసీఐ-ఎంపీఎల్ స్పోర్ట్స్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. దీనికి అనుగుణంగా- కొత్త జెర్సీ, కొత్త కిట్లను ఆ సంస్థ సమకూర్చబోతోంది. దీనితో నైక్ స్థానాన్ని ఎంపీఎల్ స్పోర్ట్స్ సంస్థ ఆక్రమించుకున్నట్టయింది. ఇదే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు కూడా కొత్త జెర్సీని ధరించబోతోన్న విషయం తెలిసిందే.

హాట్‌ హాట్‌గా ఆసీస్ టూర్..

హాట్‌ హాట్‌గా ఆసీస్ టూర్..

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా వాడివేడగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌మ్యాచ్‌లను ఆడబోతోంది కోహ్లీ అండ్ టీమ్. వన్డే మ్యాచ్‌లతో సిరీస్ ఆరంభం కానుంది. ఈ నెల 27, 29 తేదీల్లో తొలి రెండు వన్డేలను నిర్వహించేలా క్రికెట్ ఆస్ట్రేలియా షెడ్యూల్ చేసింది. ఈ రెండు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహిస్తారు. మూడో వన్డే, తొలి టీ20 మ్యాచ్‌లు క్యాన్‌బెర్రాలోని ఓవల్‌లో జరుగుతాయి. చివరి రెండు టీ20ల కోసం మళ్లీ ఆ రెండు జట్లూ సిడ్నీకే వస్తాయి.

ఇదీ షెడ్యూల్..

ఇదీ షెడ్యూల్..

తొలి వన్డే: నవంబర్ 27 (సిడ్నీ), రెండో వన్డే: నవంబర్ 29 (సిడ్నీ), మూడో వన్డే: డిసెంబర్ 2 (క్యాన్‌బెర్రా ), తొలి టీ20: డిసెంబర్ 4 (క్యాన్‌బెర్రా), రెండో టీ20: డిసెంబర్ 6 (సిడ్నీ), మూడో టీ20: డిసెంబర్ 8 (సిడ్నీ), తొలి టెస్ట్: డిసెంబర్ 17 నుంచి 21 (అడిలైడ్), రెండో టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 (మెల్‌బోర్న్), మూడో టెస్ట్: జనవరి 7 నుంచి 11 (సిడ్నీ), నాలుగో టెస్ట్: జనవరి 15 నుంచి 19 (బ్రిస్బేన్).

Story first published: Thursday, November 12, 2020, 9:19 [IST]
Other articles published on Nov 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X